E-Paper
Advertisement

బైక్‌లలో 100cc, 125cc, 150cc అంటే ఏంటి? ఇంజిన్ వెనుక అసలు లెక్క ఇదే!

బైక్‌లలో 100cc, 125cc, 150cc అంటే ఏంటి? ఇంజిన్ వెనుక అసలు లెక్క ఇదే!
Advertisement

Bike Engine CC Explained: కొత్త బైక్ కొనాలని షోరూమ్‌కు వెళ్తే 100cc, 125cc, 150cc, 200cc అంటూ రకరకాల మోడళ్లు కనిపిస్తాయి. మైలేజీ, పవర్, పికప్ గురించి సేల్స్‌ మెన్ వివరిస్తుంటారు. అయితే, బైక్ పేరులో, ఇంజిన్ వివరాల్లో కనిపించే ఈ ‘cc’ అంటే ఏమిటి? ఇంజిన్ పనితీరుకు దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఎక్కువ సీసీ ఉంటే బైక్ వేగంగా వెళ్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు సీసీ (CC) అంటే ఏమిటి?

CC అంటే క్యూబిక్ సెంటీమీటర్ (Cubic Centimetre). బైక్ ఇంజిన్‌లోని సిలిండర్‌లో పిస్టన్ కదలడానికి అందుబాటులో ఉండే స్థల పరిమాణాన్ని బట్టి ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్‌ను లెక్కిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, ఇంజిన్ ఒకసారి పనిచేసే క్రమంలో పిస్టన్ కిందికి, పైకి కదిలేటప్పుడు సిలిండర్‌ లో అటు ఇటు కదిలే గాలి, ఫ్యూయల్ పరిమాణాన్నే సీసీ అంటారు. 100cc బైక్ ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ సుమారు 100 క్యూబిక్ సెంటీమీటర్లు ఉంటుంది. అదే 150cc బైక్‌లో ఈ పరిమాణం 150 క్యూబిక్ సెంటీమీటర్లకు దగ్గరగా ఉంటుంది.

ఎక్కువ సీసీ ఉంటే పవర్ కూడా ఎక్కువేనా?

Advertisement

సాధారణంగా ఇంజిన్ సీసీ పెరిగే కొద్దీ ఎక్కువ గాలి, ఇంధన మిశ్రమాన్ని మండించే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే, 100cc బైక్‌లతో పోలిస్తే 125cc, 150cc బైక్‌లు సాధారణంగా మంచి పికప్, ఎక్కువ పవర్ అందిస్తాయి. అయితే, సీసీ ఎక్కువగా ఉందని ప్రతి బైక్ వేగంగా వెళ్తుందని చెప్పలేం. ఇంజిన్ డిజైన్, ఫ్యూయల్ ఇంజెక్షన్, ట్యూనింగ్, గేర్‌బాక్స్, బైక్ బరువు లాంటి అంశాలు కూడా పనితీరుపై ప్రభావం చూపుతాయి.

100cc, 125cc, 150cc బైక్‌ల మధ్య తేడా ఏంటి?

100cc బైక్‌లు సాధారణంగా రోజువారీ ప్రయాణాలు, మంచి మైలేజీ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. 125cc బైక్‌లు మైలేజీతో పాటు కొంత మెరుగైన పికప్, పవర్ కోరుకునే వారికి ఉపయోగపడతాయి. ఇక 150cc బైక్‌లు ఎక్కువ పవర్, మెరుగైన యాక్సిలరేషన్, హైవే ప్రయాణాల్లో కొంత మెరుగైన పనితీరు కోరుకునే వారికి నచ్చుతాయి.

బైక్ కొనేటప్పుడు సీసీ ఒక్కటే చూడకండి!

Advertisement

ఎక్కువ సీసీ ఉన్న బైక్ కొనడమే మంచి నిర్ణయం కాదు. రోజూ ఎంత దూరం ప్రయాణిస్తారు? మైలేజీ ఎంత కావాలి? బైక్‌ను నగరంలో ఎక్కువగా వాడతారా, హైవేలపై నడుపుతారా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సీసీతో పాటు పవర్, టార్క్, మైలేజీ, మెయింటెనెన్స్ ఖర్చులను పరిశీలిస్తే మీ అవసరాలకు సరిపోయే బైక్‌ను తీసుకోవచ్చు.

Read Also: కార్ల స్పీడోమీటర్‌లో 220, 240, 260 వరకు స్పీడ్ ఎందుకు ఉంటుంది? మన రోడ్లపై అంత వేగం సాధ్యమేనా?

Tags

Related News

కార్ల స్పీడోమీటర్‌లో 220, 240, 260 వరకు స్పీడ్ ఎందుకు ఉంటుంది? మన రోడ్లపై అంత వేగం సాధ్యమేనా?

వైరల్ వీడియో.. బైక్ పెట్రోల్ ట్యాంకులకు రంథ్రాలు చేసి.. ఇదేం ట్రెండు?

క్లచ్ పట్టకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. హోండా కొత్త బైక్ వచ్చేసింది!

రిలీజ్ కు ముందే కాంబాట్ SUV ఫొటోలు లీక్.. ఫీచర్లు, రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!

Big Stories

Advertisement
×