E-Paper
Advertisement

కార్ల స్పీడోమీటర్‌లో 220, 240, 260 వరకు స్పీడ్ ఎందుకు ఉంటుంది? మన రోడ్లపై అంత వేగం సాధ్యమేనా?

కార్ల స్పీడోమీటర్‌లో 220, 240, 260 వరకు స్పీడ్ ఎందుకు ఉంటుంది? మన రోడ్లపై అంత వేగం సాధ్యమేనా?
Advertisement

Car Speedometer Secrets: కారులో ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది స్పీడోమీటర్‌ను గమనించే ఉంటారు. కొన్ని కార్లలో 180 కిలోమీటర్లు, మరికొన్నింటిలో 220, 240, చివరికి 260 కిలోమీటర్ల వరకు వేగాన్ని చూపించేలా మీటర్ ఉంటుంది. అయితే, మన దేశంలోని రోడ్లపై ఇంత వేగంతో ప్రయాణించడం సాధ్యమేనా? అసలు కార్ల కంపెనీలు అంత ఎక్కువ వేగాన్ని చూపించే స్పీడోమీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తాయి? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

కార్లలో 260 కిలోమీటర్ల వరకు ఎందుకు చూపిస్తారు?

స్పీడోమీటర్‌లో కనిపించే గరిష్ఠ వేగం అంటే ఆ కారు అంత వేగంతో తప్పనిసరిగా ప్రయాణిస్తుందని అర్థం కాదు. అది కేవలం వేగాన్ని చూపించే మీటర్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. కార్ల తయారీదారులు ఇంజిన్ పనితీరు, కారు సామర్థ్యం, మార్కెట్ అవసరాలను బట్టి స్పీడోమీటర్ డిజైన్ చేస్తారు. కామన్ గా హ్యాచ్‌బ్యాక్ కార్లలో 180, 200 కిలోమీటర్ల వరకు స్పీడోమీటర్ ఉండవచ్చు. ఖరీదైన సెడాన్లు, SUVలు, స్పోర్ట్స్ కార్లలో 220 నుంచి 260 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ వేగాన్ని చూపించే మీటర్లు కనిపిస్తాయి.

స్పీడోమీటర్‌లో చూపినంత వేగం సాధ్యమేనా?

Advertisement

స్పీడోమీటర్‌లో 240 కిలోమీటర్లు ఉన్నంత మాత్రాన ఆ కారు అంత వేగంతో వెళ్లగలదని చెప్పలేం. కారు ఇంజిన్ సామర్థ్యం, హార్స్‌ పవర్, గేర్‌బాక్స్, టైర్ల సామర్థ్యం, ఎయిర్ రెసిస్టెన్స్ లాంటి అంశాలు వాస్తవ గరిష్ఠ వేగాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని కార్లు స్పీడోమీటర్‌ లో చూపించిన గరిష్ఠ వేగానికి దగ్గరగా కూడా వెళ్లలేవు. మరికొన్ని హై పర్ఫార్మెన్స్ కార్లు మాత్రం ఆ వేగాన్ని చేరుకోగలవు.

మన దేశంలో 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చా?

దేశంలో వాహనాల వేగ పరిమితులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. రహదారి రకం, వెహికల్ కేటగిరీని బట్టి పరిమితులు మారుతుంటాయి. సాధారణంగా కార్లకు ఎక్స్‌ ప్రెస్‌వేలపై గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వరకు అనుమతి ఉంటుంది. జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై పరిమితులు ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే, మీ కారు స్పీడోమీటర్‌ లో 260 కిలోమీటర్లు ఉన్నా, రోడ్డు నిబంధనలు అనుమతించకపోతే అంత వేగంతో నడపడానికి వీల్లేదు. అతివేగంగా వాహనం నడిపితే జరిమానాలతో పాటు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది.

స్పీడోమీటర్‌లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్..   

Advertisement

చాలా కార్లలో స్పీడోమీటర్ చూపించే వేగం, వాహనం వాస్తవ వేగం కంటే కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. అంతర్జాతీయ వాహన ప్రమాణాల ప్రకారం స్పీడోమీటర్ నిజమైన వేగం కంటే తక్కువగా చూపించకూడదు. అందుకే మీటర్‌లో కనిపించే వేగాన్ని చూసి వాహనం అదే వేగంతో వెళ్తోందని భావించకూడదు. కారులో 220, 240, 260 కిలోమీటర్ల వరకు స్పీడోమీటర్ ఉండటం అనేది కారు అంత వేగంతో నడపాలనే ఉద్దేశంతో కాదు. వెహికల్ డిజైన్, పనితీరు, మార్కెట్ అవసరాలకు సంబంధించిన అంశం మాత్రమే. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు స్పీడోమీటర్ గరిష్ఠ వేగం కంటే ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

Read Also: క్లచ్ పట్టకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. హోండా కొత్త బైక్ వచ్చేసింది!

Tags

Related News

వైరల్ వీడియో.. బైక్ పెట్రోల్ ట్యాంకులకు రంథ్రాలు చేసి.. ఇదేం ట్రెండు?

క్లచ్ పట్టకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. హోండా కొత్త బైక్ వచ్చేసింది!

రిలీజ్ కు ముందే కాంబాట్ SUV ఫొటోలు లీక్.. ఫీచర్లు, రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

Big Stories

Advertisement
×