E-Paper
Advertisement

రిలీజ్ కు ముందే కాంబాట్ SUV ఫొటోలు లీక్.. ఫీచర్లు, రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

రిలీజ్ కు ముందే కాంబాట్ SUV ఫొటోలు లీక్.. ఫీచర్లు, రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

JSW Combat Plug-in Hybrid SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో కొత్త SUV అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. JSW మోటార్స్ తొలి మోడల్‌గా తీసుకొస్తున్న JSW కాంబాట్ (JSW Combat)  స్పై షాట్స్ విడుదల అయ్యాయి. డిసెంబర్ 3, 2026న అధికారికంగా ఆవిష్కరించనున్న ఈ SUVకి సంబంధించిన ఫొటోలు ముందుగానే బయటకు రావడంతో కారు ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు ఈ కారుపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.

జెటూర్ T2 ఆధారంగా కొత్త SUV

JSW కాంబాట్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న జెటూర్ T2 (Jetour T2) ఆధారంగా రూపొందుతోంది. అయితే, భారత మార్కెట్ కోసం కొన్ని మార్పులు చేశారు. తాజాగా లీకైన ఫొటోల్లో ముందు భాగంలోని గ్రిల్‌పై ఉన్న ‘JETOUR’ పేరును తొలగించి, దాని స్థానంలో ‘COMBAT’ అక్షరాలను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. బయటి డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. JSW బ్రాండింగ్‌ తో పాటు భారతీయ వినియోగదారులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

15.6 అంగుళాల టచ్‌స్క్రీన్.. అదిరిపోయే ఫీచర్లు..

Advertisement

కాంబాట్ ఇంటీరియర్‌లో ఆధునిక ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌ స్క్రీన్, 10.6 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇక కీలక ఫీచర్ల విషయానికి వస్తే.. 12 స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 540 డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఈ ఫీచర్లు SUVలో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే అవకాశం ఉంది.

360hp పవర్ ఇచ్చే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇంజిన్

JSW కాంబాట్‌లో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. వీటికి 18.4kWh బ్యాటరీ ప్యాక్‌ను యాడ్ చేయనున్నారు. ఈ హైబ్రిడ్ సెటప్ ద్వారా 360hp గరిష్ఠ పవర్, 610Nm టార్క్ ఉంటుందని భావిస్తున్నారు. 3-స్పీడ్ ప్రత్యేక హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కు పవర్ అందుతుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల రేంజ్!

Advertisement

ఈ SUVలోని 18.4kWh బ్యాటరీతో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే, ఇది అంతర్జాతీయ వెర్షన్‌కు సంబంధించిన NEDC రేంజ్. భారత వెర్షన్‌లో రేంజ్ వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 6.6kW AC ఛార్జర్‌తో 30 నుంచి 100 శాతం ఛార్జింగ్‌కు సుమారు 3 గంటలు పడుతుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 30 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు 27 నిమిషాలు పడుతుంది.

ధర ఎంత ఉంటుందంటే?

JSW కాంబాట్ ఎక్స్‌ షోరూమ్ ధర సుమారు రూ.40 లక్షలుగా ఉండవచ్చని తెలుస్తోంది. డిసెంబర్ 3న ఈ SUVని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. పవర్ ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్, మంచి ఎలక్ట్రిక్ రేంజ్, ప్రీమియం ఫీచర్లతో JSW కాంబాట్ భారత SUV మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Read Also: లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

Tags

Related News

పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన హ్యుందాయ్ వెర్నా.. టాప్ రేటింగ్ తో సత్తా!

టాటా సియెర్రా EVకి 5 స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిందిగా!

Big Stories

Advertisement
×