E-Paper
Advertisement

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?
Advertisement

October 2026 Car Sales: భారత కార్ల మార్కెట్‌ లో అక్టోబర్ నెలలో అమ్మకాల జోరు కొనసాగుతోంది. పండుగల సీజన్ కావడంతో కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టాటా మోటార్స్ మాత్రం అద్భుతమైన అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మహీంద్రా, హ్యుందాయ్ లాంటి  కంపెనీలను వెనక్కి నెట్టి టాటా ఈ ఘనత సాధించింది.

మారుతీ సుజుకి టాప్ ప్లేస్

అక్టోబర్ నెలలోనూ మారుతీ సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. దేశీయంగా 2,12,384 కార్లను అమ్మింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 20.46 శాతం పెరిగాయి. ముఖ్యంగా చిన్న కార్లు, కాంపాక్ట్ మోడళ్లు, SUVలకు మంచి ఆదరణ లభించింది. ఎగుమతులు, ఇతర కంపెనీలకు సరఫరా చేసిన వాహనాలతో కలిపి మొత్తం అమ్మకాలు 2,76,120 యూనిట్లకు చేరాయి.

టాటా మోటార్స్ రెండో స్థానం

Advertisement

ఈ నెలలో టాటా మోటార్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 73,894 దేశీయ ప్యాసింజర్ వాహనాలను విక్రయించి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 20.9 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌ తో పోలిస్తే కూడా భారీ వృద్ధి నమోదైంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోనూ 14,552 యూనిట్ల అమ్మకాలతో టాటా మంచి ప్రదర్శన కనబరిచింది.

మూడో స్థానానికి మహీంద్రా

మహీంద్రా 73,338 దేశీయ SUVలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 2.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ దేశీయ SUV అమ్మకాలుగా నిలిచింది.

హ్యుందాయ్ నాలుగో స్థానం

Advertisement

హ్యుందాయ్ అక్టోబర్‌లో 62,799 కార్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 16.7 శాతం వృద్ధి సాధించింది. వెన్యూ మోడల్ అమ్మకాల్లో కీలక పాత్ర పోషించింది.

ఐదో స్థానంలో కియా

కియా 33,462 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 13.2 శాతం వృద్ధి సాధించింది. సెల్టోస్, సోనెట్ మోడళ్లకు మంచి డిమాండ్ లభించింది.

ఇతర కంపెనీల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

టయోటా 29,521 యూనిట్ల దేశీయ అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. స్కోడా, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ 9,083 యూనిట్లను నమోదు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ 7,014 వాహనాలను విక్రయించగా, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఎక్కువగా ఉంది. హోండా 5,429 యూనిట్లు, రెనాల్ట్ 4,577 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. నిస్సాన్ 3,257 యూనిట్లతో తన అమ్మకాల వివరాలను వెల్లడించింది.

అక్టోబర్ నెలలో టాటా మోటార్స్ అమ్మకాల్లో దుమ్మురేపింది. మారుతీ తన అగ్రస్థానాన్ని కొనసాగించగా, రెండో స్థానం కోసం జరిగిన పోటీలో టాటా మహీంద్రాను వెనక్కి నెట్టడం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు.

Read Also: పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

Tags

Related News

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!

పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?

మహీంద్రా కార్లకు పండుగ సీజన్ బూస్ట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!

Big Stories

Advertisement
×