E-Paper
Advertisement

మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!

మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!
Advertisement

Maruti Suzuki Upcoming Cars: మారుతి సుజుకి కార్లను కొనాలని చూస్తున్న వారికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ తన కార్ల లైనప్‌లో కీలకమైన మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా నెక్సా విభాగంలో కొత్త మోడళ్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న కార్లకు ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్లను తీసుకురానుంది. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, ఎలక్ట్రిక్ టెక్నాలజీతో మొత్తం నాలుగు కార్లు రానున్నాయి.

1.మారుతి YMC ఎలక్ట్రిక్ MPV

మారుతి సుజుకి తీసుకురానున్న కొత్త ఎలక్ట్రిక్ MPV ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. YMC పేరుతో ప్రచారంలో ఉన్న ఈ కారు ఏడు సీట్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే మారుతి నుంచి వచ్చే రెండో ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఈ MPVలో బాక్సీ డిజైన్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, పొడవైన రూఫ్‌లైన్ ఉండనున్నాయి. ఇందులో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని అంచనా. ఇ-విటారా మాదిరిగానే HEARTECT-E ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించే అవకాశం ఉంది.

2.మారుతి ఇన్విక్టో ఫేస్‌లిఫ్ట్

Advertisement

మారుతి ఇన్విక్టో కూడా త్వరలో కొత్త రూపంలో రానుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందిన ఈ MPVకి ఫేస్‌లిఫ్ట్ తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. కొత్త వెర్షన్‌ లో ముందు బంపర్ డిజైన్‌ లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే ఇంటీరియర్‌ లో కొత్త అప్‌హోల్స్టరీ, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి మార్పులు చేయనున్నారు. అయితే ఇంజిన్, ఇతర మెకానికల్ అంశాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

3.మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్

మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్ కూడా త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2027 భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. తాజా స్పై చిత్రాల ప్రకారం ఇందులో ADAS టెక్నాలజీ, లేన్ వాచ్ కెమెరా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఫ్రంట్ బంపర్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు లాంటి మార్పులు కూడా రావచ్చు. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కొనసాగవచ్చని, సాధారణ పెట్రోల్ ఇంజిన్‌లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

4.మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్

Advertisement

మారుతి XL6 కూడా కొత్త అప్‌డేట్లతో రానుంది. ఇండోనేషియాలో ప్రదర్శించిన XL7 డిజైన్‌ను పరిశీలిస్తే, రాబోయే XL6లో ఎలాంటి మార్పులు ఉండవచ్చో అర్థమవుతోంది. కొత్త బంపర్, ఫాగ్ ల్యాంప్ సరౌండ్స్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, కొత్త రియర్ స్పాయిలర్ వంటి మార్పులు ఉండవచ్చు. ఇంజిన్ పరంగా మాత్రం ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగవచ్చని తెలుసతోంది. ఇది 102bhp పవర్, 137Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also: MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

Tags

Related News

MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు.. నవంబర్‌లో రానున్న కొత్త కార్లు ఇవే!

నవంబర్ లో మార్కెట్లోకి కొత్త ఈవీలు.. టీవీఎస్, సుజుకి, ఓబెన్ నుంచి అదిరిపోయే మోడళ్లు!

SMK నుంచి అదిరిపోయే హెల్మెట్.. స్పెషల్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ.. 2027లో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు!

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా సంచలనం.. ఎంజీ విండ్సర్‌కు పోటీగా కొత్త ఈవీ

Big Stories

Advertisement
×