E-Paper
Advertisement

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?
Advertisement

Electric Two Wheeler Sales October 2026: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండటంతో చాలామంది ఈవీ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా అక్టోబర్ 2026లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఒక్క నెలలోనే ఏకంగా 2.23 లక్షలకు పైగా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ జాబితాలో టీవీఎస్ అగ్రస్థానంలో నిలవగా, బజాజ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

టీవీఎస్ అమ్మకాల్లో భారీ దూకుడు

అక్టోబర్ నెలలో టీవీఎస్ ఏకంగా 60,429 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. ఒక నెలలో 60 వేల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన తొలి భారతీయ ఈవీ టూ వీలర్ బ్రాండ్‌గా రికార్డు సృష్టించింది. మొత్తం మార్కెట్లో 27 శాతం వాటాను దక్కించుకుంది. ఐక్యూబ్, ఆర్బిటర్ మోడళ్లకు లభిస్తున్న డిమాండ్‌తో ఉత్పత్తిని మరింత పెంచాలని కంపెనీ భావిస్తోంది.

బజాజ్ చేతక్‌కు పెరుగుతున్న ఆదరణ

Advertisement

బజాజ్ కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. అక్టోబర్‌లో 49,067 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. దీంతో 22 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చేతక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఏథర్, విడా అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఏథర్ ఎనర్జీ అక్టోబర్‌లో 31,796 స్కూటర్లను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 5 శాతం పెరిగాయి. మరోవైపు హీరో మోటోకార్ప్‌ కు చెందిన విడా బ్రాండ్ మాత్రం 29,901 యూనిట్ల అమ్మకాలతో ఆకట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే 81 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ కష్టాలు

Advertisement

ఒకప్పుడు ఈవీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అక్టోబర్‌లో 12,096 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 26 శాతం తగ్గాయి. టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ ఓలాకు సవాలుగా మారింది.

ఇతర కంపెనీల అమ్మకాలు

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 10,838 యూనిట్లను విక్రయించింది. రివర్ 6,796 యూనిట్లు, బీగాస్ 5,554 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఈ స్ప్రింటో 2,124 యూనిట్లు, మోటోవోల్ట్ 1,702 యూనిట్లను విక్రయించాయి.

నవంబర్‌లో మరిన్ని రికార్డులు నమోదయ్యేనా?

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 48 శాతం పెరిగాయి. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 17.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశంలోని మొత్తం ఈవీ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వాటా 63 శాతంగా ఉంది. నవంబర్‌లో దీపావళి  ఉండటంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో 2.5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును ఇండస్ట్రీ అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also:నవంబర్ లో మార్కెట్లోకి కొత్త ఈవీలు.. టీవీఎస్, సుజుకి, ఓబెన్ నుంచి అదిరిపోయే మోడళ్లు!

Tags

Related News

క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్ కు కళ్లు చెదిరే డిమాండ్, జస్ట్ 6 నిమిషాల్లోనే అన్నీ సేల్!

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?

మహీంద్రా కార్లకు పండుగ సీజన్ బూస్ట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Big Stories

Advertisement
×