E-Paper
Advertisement

హ్యుందాయ్ కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి కార్ల ధరల పెంపు!

హ్యుందాయ్ కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి కార్ల ధరల పెంపు!
Advertisement

Hyundai Price Revision 2026: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా కార్లను ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. నిజానికి మే 1 నుంచే ధరలను పెంచాలని భావించినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దాన్ని ఒక నెల వాయిదా వేసింది. కొత్త ధరలు జూన్ 1  నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

మోడల్, వేరియంట్ ను బట్టి ధరల పెంపు

కంపెనీకి చెందిన పలు మోడళ్లలో గరిష్టంగా 1 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. మోడల్, వేరియంట్‌ ను బట్టి ఈ పెంపు రూ.12,800 వరకు ఉండొచ్చని అంచనా. అయితే, ఏ మోడల్‌ పై ఎంత మేరకు పెంపు ఉంటుందనే పూర్తి వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. హ్యుందాయ్ ధర పెంపు నిర్ణయానికి ప్రధాన కారణాలుగా ముడిసరుకు ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, నిర్వహణ ఖర్చుల భారం అని ప్రకటించింది. గత కొంతకాలంగా ఆటో ఇండస్ట్రీ మొత్తం ఇదే సమస్యను ఎదుర్కొంటుండగా, పలు కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచాయి. ఇప్పుడు హ్యుందాయ్ కూడా అదే దారిలో నడుస్తోంది.

భారత మార్కెట్ లో 10 రకాల కార్లు

Advertisement

ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ 10 రకాల కార్లను విక్రయిస్తోంది. వీటిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, ఎక్స్టర్, వెన్యూ, క్రెటా, వెర్నా, అల్కాజర్, క్రెటా ఎలక్ట్రిక్ మరియు అయోనిక్ 5 వంటి మోడళ్లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్‌ ల నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల వరకు విభిన్న విభాగాల్లో కంపెనీ ఉత్పత్తులను అందిస్తోంది.  గ్రాండ్ ఐ10 నియోస్ ధర ప్రస్తుతం రూ.5.55 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, అయోనిక్ 5 ధర రూ.55.70 లక్షల వరకు ఉంది. మిడ్ రేంజ్ లో వెన్యూ, క్రెటా, వెర్నా లాంటి మోడళ్లు మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ధరల పెంపు తర్వాత ఈ మోడళ్ల కొనుగోలు వ్యయం కొంత మేర పెరగనుంది.

2026లో రెండోసారి ధరల పెంపు!

2026లో హ్యుందాయ్ రెండోసారి ధరలను పెంచింది. ఈ ఏడాది జనవరిలో కూడా కంపెనీ ధరలను పెంచింది. అప్పట్లో కూడా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలనే కారణంగా చూపించింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ధరలను సవరించాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది.  ముడిసరుకు ధరలు స్థిరపడే వరకు ఇలాంటి ధరల పెంపులు కొనసాగే అవకాశం ఉందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 1 తర్వాత కొత్త హ్యుందాయ్ కారు కొనాలని భావిస్తున్న వారు అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సి రావచ్చు. సో, కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ధరల పెంపు అమల్లోకి రాకముందే బుకింగ్ చేసుకోవడం ద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

Read Also: డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ కీలక నిర్ణయం.. EV ఉత్పత్తి 50% పెంపు!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×