E-Paper
Advertisement

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!
Advertisement

JSW Combat SUV: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న JSW మోటార్స్ తన తొలి SUV కాంబాట్ గురించి కీలక ప్రకటన చేసింది. ఈ కొత్త SUV కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. కాంబాట్ డెలివరీలను 2027 జనవరి మధ్య నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, తొలి 500 మంది కొనుగోలుదారులకు ప్రత్యేకంగా పయనీర్ ఎడిషన్‌ను అందించనుంది. ఈ ఎడిషన్‌లో భాగంగా కస్టమర్లకు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ లభించనున్నాయి.

నవంబర్ 28 నుంచి బుకింగ్స్..  

JSW కాంబాట్ పయనీర్ ఎడిషన్ బుకింగ్స్ నవంబర్ 28, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బుకింగ్స్‌ ను ఒకే టైమ్ లో కాకుండా దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు రూ.1 లక్ష రిజిస్ట్రేషన్ మొత్తం చెల్లించి SUVని బుక్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. బుకింగ్ సమయంలో  కనీస ధరను కూడా ప్రకటించనున్నారు. పయనీర్ ఎడిషన్‌ కావాలనుకునే వాళ్లు, ఆ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ మొత్తం కారు అసలు ఎక్స్-షోరూమ్ ధర కాదని JSW స్పష్టం చేసింది. SUV అధికారిక ధరను తర్వాత ప్రకటించనుంది.

తొలి 500 మందికి స్పెషల్ బెనిఫిట్స్ 

Advertisement

పయనీర్ ఎడిషన్ బుక్ చేసుకునే మొదటి 500 మంది కస్టమర్లకు కంపెనీ స్పెషల్ ఎక్స్ పీరియెన్స్ అందించనుంది. ఇందులో భాగంగా స్పెషల్ రిలేషన్‌షిప్ మేనేజర్‌ను కేటాయిస్తారు. అంతేకాదు, JSW ఈవెంట్లకు స్పెషల్ ఎంట్రీ కల్పిస్తారు. వీటితో పాటు పయనీర్స్ వెల్‌ కమ్ కిట్‌ను కూడా అందించనున్నారు.

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌తో కాంబాట్

JSW కాంబాట్ SUV, చైనాకు చెందిన జెటూర్ T2 ఆధారంగా రూపొందింది. ఇందులో 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 154bhp పవర్, 220Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి జతగా డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో కూడిన సెటప్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థ 221bhp పవర్, 390Nm టార్క్‌ ను అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ సాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో 137 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

2027 జనవరిలో రోడ్డెక్కే అవకాశం..

Advertisement

JSW కాంబాట్ డెలివరీలు 2027 జనవరి మధ్యలో ప్రారంభం కానున్నాయి. కొత్త SUV ధరలు, ఇతర వేరియంట్లు, పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Read Also: ఇన్విక్టోలో టయోటా మ్యాజిక్.. ఇక E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ తో పరుగులు!

Tags

Related News

ఇన్విక్టోలో టయోటా మ్యాజిక్.. ఇక E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ తో పరుగులు!

మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!

నెక్సాన్ To అవినయ ఎక్స్.. టాటా నుంచి రాబోతున్న 5 క్రేజీ కార్లు!

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

తక్కువ బరువు, మంచి రేంజ్‌.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×