E-Paper
Advertisement

ఫ్రంట్‌ లైన్ ఆపరేషన్లలో ఎలక్ట్రిక్ బైక్‌లు.. భారత సైన్యం కొత్త ప్లాన్!

ఫ్రంట్‌ లైన్ ఆపరేషన్లలో ఎలక్ట్రిక్ బైక్‌లు.. భారత సైన్యం కొత్త ప్లాన్!
Advertisement

Indian Army’s Shift Towards EV Mobility: భారత సైన్యం ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రంట్‌ లైన్ ఆపరేషన్ల కోసం సైలెంట్ గా పని చేసే ఎలక్ట్రిక్ బైక్‌లను ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. సాధారణ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు శబ్దం తక్కువగా ఉండటం, వేడి తక్కువగా విడుదల చేయడం లాంటి అంశాల కారణంగా సీక్రెట్ ఆపరేషన్లకు వీటిని ఉపయోగించాలని భావిస్తోంది.

ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం

ఇప్పటి వరకు సైనికులు ఎక్కువగా పెట్రోల్ బైక్‌ లను ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు మిషన్ల సమయంలో శత్రువులకు అనుమానం కలగకుండా ఎలక్ట్రిక్ బైక్స్ మీద దృష్టి పెట్టుతున్నారు. ఈ బైక్‌లను కొందరు  సైలెంట్ స్కౌట్స్ అని పిలుస్తున్నారు. వీటి సహాయంతో సైనికులు శత్రువుకు తెలియకుండా నిశ్శబ్దంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. 2024లోనే దేశవ్యాప్తంగా సైనిక స్థావరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ప్రతిపాదన వచ్చింది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు,  మోటార్‌సైకిళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకత ఏమిటంటే?

Advertisement

ఇవి కఠినమైన పరిస్థితుల్లో కూడా పని చేయగలగాలి. అస్సాం కొండ ప్రాంతాల నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు విభిన్న భూభాగాల్లో నడవాలి. అలాగే, పూర్తి ఆయుధ సామగ్రితో ఉన్న సైనికుడిని సులభంగా తీసుకెళ్లగల సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలం ఉపయోగించడానికి వీలుగా కనీసం ఐదేళ్ల పాటు సేవలు అందించేలా రూపొందించాలని సైన్యం భావిస్తోంది.ఈ బైక్ లతో మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఈ బైక్‌లు తక్కువ వేడిని విడుదల చేస్తాయి. దీనివల్ల థర్మల్ సెన్సార్ల ద్వారా గుర్తించడం కష్టమవుతుంది. ఇది యుద్ధ పరిస్థితుల్లో సైనికులకు అదనపు రక్షణగా మారుతుంది.

వెహికల్ టు లోడ్ (V2L) టెక్నాలజీ వినియోగం

ఈ బైక్‌లలో వెహికల్-టు-లోడ్ (V2L) సాంకేతికతను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. దీని ద్వారా బైక్ బ్యాటరీని చిన్న పవర్ సోర్స్‌ గా ఉపయోగించవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న సైనికులు కమ్యూనికేషన్ పరికరాలు, నైట్ విజన్ యాక్సెసరీస్ లాంటి వాటిని నేరుగా బైక్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

అటు భారతీయ కంపెనీలు కూడా ఆర్మీకి అవసరమైన ఈవీలను తయారు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్,  టీవీఎస్ మోటార్ కంపెనీ, హీరో కంపెనీలు వీటిని తయారు చేసేందుకు రెడీ అవుతున్నాయి. కొన్ని స్టార్టప్‌లు కూడా రక్షణ రంగానికి అనుకూలంగా ప్రత్యేక బైక్‌ లను రూపొందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగం సైన్యంలో ఒక కొత్త మార్పుకు దారితీస్తోంది. భవిష్యత్తులో యుద్ధభూమిలో సైనికుల కదలికలను ఇవి మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మార్చే అవకాశం ఉంది.

Read Also: పల్సర్ 180 vs అపాచీ RTR 180.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×