E-Paper
Advertisement

భారత్‌ లో ఈవీ స్కూటర్ల జోరు.. మేలో 1.70 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల జోరు.. మేలో 1.70 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!
Advertisement

EV Scooter Boom: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. మే నెలలో ఏకంగా 1,70,570 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మేలో నమోదైన 1,04,896 యూనిట్లతో పోలిస్తే ఏకంగా 63 శాతం వృద్ధి సాధించింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌ లో నమోదైన నెలవారీ అమ్మకాలలో ఇది రెండో అత్యధిక రికార్డు కావడం విశేషం. మార్చి 2026లో ఏకంగా 1,99,268 యూనిట్ల అమ్మకాలతో ఆల్ టైమ్ రికార్డు సాధించింది.

పెట్రో ధరల పెంపుతో పెరిగిన అమ్మకాలు

మే నెలలో పెట్రోల్ ధరలు పెరగడం ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. మే మొదటి 15 రోజుల్లో 66,487 యూనిట్లు అమ్ముడవగా, చివరి 15 రోజుల్లోనే 1,04,083 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టాప్ లో టీవీఎస్ మోటార్స్

Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో టీవీఎస్ కంపెనీ టాప్ లో కొనసాగుతోంది. మేలో టీవీఎస్ 42,415 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 64 శాతం పెరిగాయి. టీవీఎస్ ఐక్యూబ్ కంపెనీ అమ్మకాల పెరుగుదలకు మెయిన్ కారణం అయ్యింది.

రెండో స్థానంలో బజాజ్

బజాజ్ ఆటో కూడా అమ్మకాల్లో సత్తా చాటింది. కంపెనీ మేలో 39,142 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.  గత ఏడాదితో పోలిస్తే 73 శాతం ఎక్కువ. ప్రస్తుతం బజాజ్ మార్కెట్ వాటా 23 శాతంగా ఉంది. టీవీఎస్, బజాజ్ మధ్య అమ్మకాల తేడా క్రమంగా తగ్గుతోంది.

మూడో స్థానంలో ఏథర్, నాలుగో స్థానంలో విడా

Advertisement

ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో నిలిచింది. కంపెనీ 28,211 యూనిట్లను విక్రయించి 17 శాతం మార్కెట్ వాటాను సాధించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఏథర్ రిజ్తా మోడ ల్‌కు మంచి డిమాండ్ కొనసాగుతోంది. హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా బ్రాండ్ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. మేలో 19,051 యూనిట్లు అమ్ముడవగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 158 శాతం ఎక్కువ. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 11 శాతానికి చేరుకుంది.

ఐదో స్థానానికి పడిపోయిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ ఐదో స్థానంలో కొనసాగింది. మేలో 15,141 యూనిట్లు విక్రయించినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 20 శాతం తగ్గాయి. మార్కెట్ వాటా కూడా 18 శాతం నుంచి 9 శాతానికి పడిపోయింది.  ఇతర బ్రాండ్లలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, రివర్ మొబిలిటీ, బిగాస్ ఆటో, బౌన్స్ ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ మంచి వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా రివర్ మొబిలిటీ అమ్మకాలు 245 శాతం, సింపుల్ ఎనర్జీ అమ్మకాలు 338 శాతం పెరగడం విశేషం. మొత్తంగా భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ మరింత వేగంగా ఎదుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, విస్తరిస్తున్న ఛార్జింగ్ నెట్‌ వర్క్‌, కొత్త మోడళ్ల రాకతో రాబోయే నెలల్లో కూడా అమ్మకాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also: ఈ-విటారా సూపర్ హిట్.. టాప్ 4 ఈవీ బ్రాండ్లలోకి దూసుకెళ్లిన మారుతి!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×