E-Paper
Advertisement

జీప్ ఎస్‌యూవీలపై దీపావళి ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.65 లక్షల డిస్కౌంట్!

జీప్ ఎస్‌యూవీలపై దీపావళి ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.65 లక్షల డిస్కౌంట్!
Advertisement

Jeep Diwali Discount 2026: దీపావళి పండుగ సందర్భంగా కొత్త కారు కొనాలనుకునే వారికి జీప్ ఇండియా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా జీప్ మెరిడియన్, కంపాస్ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. నవంబర్ 2026లో భాగంగా ఎంపిక చేసిన వేరియంట్లపై క్యాష్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లతో పాటు మరికొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో జీప్ మెరిడియన్‌ పై గరిష్ఠంగా రూ.1.65 లక్షల వరకు, కంపాస్‌పై రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అయితే జీప్ వ్రాంగ్లర్‌పై ఈ నెలలో ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు. మరోవైపు 2026 గ్రాండ్ చెరోకీ స్టాక్ ఇప్పటికే పూర్తిగా అమ్ముడైంది.

జీప్ మెరిడియన్‌పై రూ.1.65 లక్షల వరకు తగ్గింపు

జీప్ మెరిడియన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెలలో  బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.65 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా MY2024 మోడల్ స్టాక్‌ ను కొనుగోలు చేసే వారికి రూ.1.30 లక్షల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాకుండా డాక్టర్లు, లీజింగ్ కంపెనీలకు మరో రూ.30,000 వరకు అదనపు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఈ ఆఫర్లతో మెరిడియన్ కొనుగోలుపై భారీగా డబ్బు పొదుపు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, మెరిడియన్‌లో 170hp శక్తిని ఉత్పత్తి చేసే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 4×4 (ఫోర్ వీల్ డ్రైవ్) సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం జీప్ మెరిడియన్ ధరలు రూ.23.33 లక్షల నుంచి రూ.37.92 లక్షల వరకు ఉన్నాయి.

జీప్ కంపాస్‌పై రూ.1.5 లక్షల వరకు ఆఫర్లు

జీప్ నుంచి అందుబాటులో ఉన్న మరో ప్రముఖ ఎస్‌యూవీ కంపాస్‌పై కూడా అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించారు. నవంబర్ నెలలో ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఎంపిక చేసిన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.1.10 లక్షల వరకు కార్పొరేట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు, లీజింగ్ కంపెనీలకు రూ.15,000 వరకు అడిషనల్ బెనిఫిట్స్ అందిస్తుంది.

Advertisement

కంపాస్‌ లో 170hp పవర్ అందించే 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులోని 4×4 సదుపాయం కూడా లభిస్తుంది. జీప్ కంపాస్ ఎక్స్‌ షోరూమ్ ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.30.70 లక్షల వరకు ఉన్నాయి.

ఆఫర్లు పొందాలంటే ఎలా?   

జీప్ ప్రకటించిన దీపావళి డిస్కౌంట్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. సిటీని బట్టి ఆఫర్లలో మార్పులు ఉంటాయి. అలాగే డీలర్‌ షిప్ దగ్గర అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి కూడా బెనిఫిట్స్ మారే అవకాశం ఉంది. మెరిడియన్, కంపాస్ కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా జీప్ డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read Also: నిస్సాన్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఫ్రీ CNG కిట్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా!

Tags

Related News

నిస్సాన్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఫ్రీ CNG కిట్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో విడా సరికొత్త ప్రయోగాలు.. ఒకేసారి మూడు కాన్సెప్ట్స్‌ విడుదల!

అక్టోబర్‌లో EV కార్ల అమ్మకాల జోరు.. ఏ కంపెనీ ఎన్ని EVలు అమ్మిందంటే?

ఇథనాల్‌ హైబ్రిడ్ ఇంజిన్ తో ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్.. లాంచింగ్ ఎప్పుడంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!

టాటా చరిత్రలో తొలిసారి.. జస్ట్ 10 నెలల్లోనే 6 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు!

Big Stories

Advertisement
×