E-Paper
Advertisement

నిస్సాన్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఫ్రీ CNG కిట్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా!

నిస్సాన్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఫ్రీ CNG కిట్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా!
Advertisement

Nissan Diwali Offers 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అదే సమయంలో పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే, నిస్సాన్ కస్టమర్లకు ఓ మంచి ఆఫర్ అందిస్తోంది. దీపావళి సందర్భంగా నిస్సాన్ మాగ్నైట్, గ్రావైట్ మోడళ్లపై ఫ్రీ CNG కిట్‌ను అందిస్తోంది. సాధారణంగా రూ.74,999 నుంచి రూ.85,999 వరకు ధర ఉండే CNG కిట్‌ను ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ నవంబర్ 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

CNG కిట్‌తో పాటు అదనపు వారంటీ కూడా!

నిస్సాన్ అందిస్తున్న CNG కిట్ ప్రభుత్వ అనుమతి పొందిన రెట్రోఫిట్ కిట్. అంటే, ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారుకు అదనంగా CNG సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కిట్‌తో పాటు 3 సంవత్సరాలు లేదంటే లక్ష కిలోమీటర్ల వరకు థర్డ్ పార్టీ వారంటీ కూడా లభిస్తుంది. ఇది కంపెనీ అందించే సాధారణ వారంటీకి అదనం. అయితే, ఈ ఆఫర్లు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. డీలర్ల దగ్గర స్టాక్ ను బట్టి బెనిఫిట్స్ అందిస్తారు.

నిస్సాన్ గ్రావైట్‌పై రూ.85,999 విలువైన CNG కిట్ ఫ్రీ

Advertisement

నిస్సాన్ గ్రావైట్‌లో ఎంపిక చేసిన టెక్నా వేరియంట్లకు రూ.85,999 విలువైన CNG కిట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఒకవేళ CNG కిట్ వద్దనుకుంటే, దానికి బదులుగా రూ.55,000 వరకు ఇతర బెనిఫిట్స్ తో పాటు ఒక బంగారు నాణెం పొందే అవకాశం ఉంది.

గ్రావైట్‌లో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 63hp పవర్, 72Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదంటే 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. లీటరుకు 19.3 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. గ్రావైట్ టెక్నా వేరియంట్ల ధరలు రూ.8.08 లక్షల నుంచి రూ.9.09 లక్షల వరకు ఉన్నాయి.

మాగ్నైట్‌పై రూ.74,999 విలువైన CNG కిట్ ఫ్రీ

Advertisement

మాగ్నైట్ కొనుగోలుదారులకు కూడా నిస్సాన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. విసియా MT, విసియా AMT, విసియా+ MT వేరియంట్లు మినహా మిగిలిన నాన్-టర్బో వేరియంట్లపై ఫ్రీ CNG కిట్ లభిస్తుంది. ఈ కిట్ అసలు ధర రూ.74,999. CNG కిట్ తీసుకోకూడదనుకునే కస్టమర్లకు రూ.1 లక్ష వరకు ఇతర బెనిఫిట్స్ తో పాటు ఒక బంగారు నాణెం అందిస్తున్నారు.

మాగ్నైట్ CNG మైలేజ్ ఎంత?

మాగ్నైట్‌ లో కూడా 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే, మాగ్నైట్ CNG వెర్షన్ మైలేజ్ వివరాలను నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు. దీని నాన్ టర్బో వేరియంట్ల ధరలు రూ.6.87 లక్షల నుంచి రూ.9.31 లక్షల వరకు ఉన్నాయి.

నవంబర్ 16 వరకు మాత్రమే ఆఫర్!

పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి నిస్సాన్ మాగ్నైట్, గ్రావైట్ CNG ఆఫర్లు ఉపయోగపడే అవకాశం ఉంది.   ఈ ఆఫర్ నవంబర్ 16 వరకే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

Read Also: నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

Tags

Related News

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో విడా సరికొత్త ప్రయోగాలు.. ఒకేసారి మూడు కాన్సెప్ట్స్‌ విడుదల!

అక్టోబర్‌లో EV కార్ల అమ్మకాల జోరు.. ఏ కంపెనీ ఎన్ని EVలు అమ్మిందంటే?

ఇథనాల్‌ హైబ్రిడ్ ఇంజిన్ తో ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్.. లాంచింగ్ ఎప్పుడంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!

టాటా చరిత్రలో తొలిసారి.. జస్ట్ 10 నెలల్లోనే 6 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు!

ఒకటి కాదు రెండు కాదు.. యమహా నుంచి ఒకేసారి 5 కొత్త స్కూటర్లు లాంచ్!

Big Stories

Advertisement
×