E-Paper
Advertisement

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!
Advertisement

Mahindra Thar Facelift Launch: ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహీంద్రా థార్‌కు మరోసారి ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. 2026 థార్ ఫేస్‌ లిఫ్ట్‌ ను సెప్టెంబర్ 22న పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ టెస్ట్ వెహికల్ భారత రోడ్ల మీద చాలాసార్లు కనిపించాయి. దీంతో థార్‌లో ఎలాంటి మార్పులు వస్తాయన్న ఆసక్తి పెరిగింది.

డిజైన్‌లో థార్ రాక్స్ ప్రభావం

కొత్త థార్‌లో ప్రధానంగా ఎక్స్‌ టీరియర్ డిజైన్‌కు సంబంధించిన మార్పులు కనిపించే అవకాశం ఉంది. పెద్దదైన థార్ రాక్స్ నుంచి కొన్ని డిజైన్ అంశాలను తీసుకునే అవకాశం ఉందని టెస్ట్ మ్యూల్స్ ద్వారా తెలుస్తోంది. కొత్త గ్రిల్, C-ఆకారపు DRLలతో కూడిన ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన టెయిల్‌లైట్లు ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది. థార్‌కు మరింత మోడ్రన్ లుక్ తీసుకురావడం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఫీచర్లలోనూ మార్పులు ఉంటాయా?

Advertisement

2025లో వచ్చిన అప్‌డేట్‌తో థార్‌లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్, వెనుక ఏసీ వెంట్లు, రియర్ వైపర్, వాషర్ వంటి ఫీచర్లు వచ్చాయి. అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఇంకా ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సన్‌రూఫ్, పవర్డ్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు కూడా వస్తాయా? అనేది చూడాలి.

ఇంజిన్ లో నో ఛేంజెస్?

పవర్‌ట్రెయిన్ విషయంలో మాత్రం ప్రస్తుత సెటప్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం థార్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 152hp పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 119hp 1.5 లీటర్ డీజిల్, 132hp 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో RWD సెటప్‌లో మాత్రమే లభిస్తుంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ RWDతో పాటు 4WD ఆప్షన్‌లోనూ ఉంటుంది. 2.2 లీటర్ డీజిల్‌లో 4WD అందుబాటులో ఉంది. పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లకు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది.

ధర కూడా మారే అవకాశం!

Advertisement

ప్రస్తుతం థార్ ధర రూ.10.32 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఎక్స్ షోరూమ్‌గా ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌ లో డిజైన్, ఫీచర్ల మార్పులతో పాటు ధరలో కూడా మార్పు ఉండే అవకాశం ఉంది. అయితే, కొత్త ధరలు, పూర్తి ఫీచర్ లిస్ట్, వేరియంట్ వివరాలు అధికారిక లాంచ్ సమయంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22న లాంచ్ జరుగుతుందన్న సమాచారం నిజమైతే, త్వరలోనే థార్ కొత్త వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

Read Also: థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

Tags

Related News

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×