E-Paper
Advertisement

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!
Advertisement

New SUVs Coming This Festive Season: దీపావళి పండుగకు ముందు కార్ల మార్కెట్‌లో సందడి మరింత పెరగనుంది. సాధారణంగా పండుగ సీజన్‌లో కొత్త కారు కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈసారి కూడా అదే సమయంలో కొత్త SUVలు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. కాంపాక్ట్ SUVల నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల వరకు పలు మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో టాప్ 5 మోడల్స్ గురించి తెలుసుకుందాం..

1.హ్యుందాయ్ బేయాన్

హ్యుందాయ్ నుంచి రాబోతున్న బేయాన్‌పై ప్రస్తుతం మంచి ఆసక్తి నెలకొంది. ఈ కాంపాక్ట్ SUV అక్టోబర్‌ లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. క్రెటా కంటే భిన్నమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఇంజిన్ విషయంలో టర్బో పెట్రోల్‌ తో పాటు డీజిల్ ఆప్షన్ కూడా ఉండొచ్చని అంచనా. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో ఇప్పటికే పోటీ ఉన్న నేపథ్యంలో బేయాన్ రాకతో పోటీ మరింత పెరగనుంది.

2.మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్

Advertisement

ఆఫ్‌ రోడ్ వెహికల్ లవర్స్ ఎదురుచూస్తున్న మరో మోడల్ మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్. సెప్టెంబర్ 22న దీనిని ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ లో డిజైన్, ఫీచర్లలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సాఫ్ట్-టాప్ వెర్షన్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లే కొనసాగవచ్చని తెలుస్తోంది.

3.కొత్త ఆడి క్యూ3

లగ్జరీ SUV కొనాలనుకునేవారికి కొత్త ఆడి క్యూ3 మరో బెస్ట్ ఆప్షన్ కానుంది. థర్డ్ జెనరేషన్ క్యూ3 అక్టోబర్‌ లో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. గత మోడల్‌తో పోలిస్తే కొత్త క్యూ3లో డిజైన్ మరింత షార్ప్‌ గా, టెక్నాలజీ పరంగా ఆధునికంగా ఉండనుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ TSI ఇంజిన్‌ తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ ను అందించే అవకాశం ఉంది.

4.వోల్వో EX90

Advertisement

లగ్జరీ ఎలక్ట్రిక్ SUVల విభాగంలో వోల్వో EX90పై ఇంట్రెస్ట్ పెంచుతోంది. అక్టోబర్ 12న ఈ ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్‌లో విడుదల కానుంది. 106 kWh బ్యాటరీ ప్యాక్‌తో సుమారు 625 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.  0-100 kmph వేగాన్ని కేవలం 5.5 సెకన్లలో అందుకుంటుందని తెలుస్తోంది.

5.రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్

ఒకప్పుడు భారత SUV మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డస్టర్ ఇప్పుడు కొత్త రూపంలోనే కాకుండా హైబ్రిడ్ టెక్నాలజీతో తిరిగి రానుంది. నవంబర్‌లో డస్టర్ హైబ్రిడ్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.4 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉండనుంది. దాదాపు 160 PS పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. బయట డిజైన్, ఫీచర్ల విషయంలో పెట్రోల్ వెర్షన్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ.. హైబ్రిడ్ టెక్నాలజీ ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.

Read Also: ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

Tags

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×