E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

స్కార్పియో ఫేస్‌ లిఫ్ట్ To BE 07 EV.. మహీంద్రా నుంచి ఏకంగా 6 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

స్కార్పియో ఫేస్‌ లిఫ్ట్ To BE 07 EV..  మహీంద్రా నుంచి ఏకంగా 6 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!
Advertisement

Mahindra 6 New SUVs: భారత్ లో అతిపెద్ద ఎస్‌యూవీ తయారీ సంస్థల్లో ఒకటైన మహీంద్రా, రాబోయే రోజుల్లో అదిరిపోయే మోడల్స్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న స్కార్పియో, థార్, XUV లాంటి మోడళ్లతో పాటు, కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు, ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్లను కూడా కంపెనీ తీసుకురానుంది. మొత్తం ఆరు కొత్త ICE, ఎలక్ట్రిక్ కార్లను మహీంద్రా లాంచ్ చేయబోతోంది.

⦿ స్కార్పియో క్లాసిక్ ఫేస్‌ లిఫ్ట్

ఈ లిస్టులో స్కార్పియో క్లాసిక్ ఫేస్‌ లిఫ్ట్ ముందు వరుసలో ఉంది. మహీంద్రా బ్రాండ్‌ కు కొత్త ఊపునిచ్చిన స్కార్పియో ఇప్పుడు అప్‌ డేటెడ్ రూపంలో రానుంది. ఈ SUVలో కొత్త గ్రిల్, లేటెస్ట్ బంపర్లు, అప్‌డే ట్ చేసిన లైటింగ్ లాంటి చిన్నపాటి మార్పులు కనిపించనున్నాయి. ఇంటీరియర్‌ లో కొత్త టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, మెరుగైన సీటు కవర్లు, అదనపు ఛార్జింగ్ పోర్టులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు.

⦿ స్కార్పియో-ఎన్ ఫేస్‌ లిఫ్ట్

Advertisement

ఇక స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది. టెస్టింగ్ సమయంలో ఈ SUV పలుమార్లు కనిపించింది. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ ల్యాంప్స్, కొత్త బంపర్లు, కొత్త DRLలు, 19 అంగుళాల వీల్స్ లాంటి మార్పులు ఇందులో ఉండొచ్చు. పనోరమిక్ సన్‌ రూఫ్, పెద్ద టచ్‌ స్క్రీన్, పూర్తిగా డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లను కూడా యాడ్ చేయనుంది. ఈ SUVలో ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కొనసాగించనున్నారు.

⦿ కొత్త బ్యాటరీ ప్యాక్స్ తో BE 6, XEV 9e

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా మరో కీలక అడుగు వేస్తోంది. ఇటీవల అభివృద్ధి చేసిన 70 kWh బ్యాటరీ ప్యాక్‌ను BE 6, XEV 9e మోడళ్లలో అందించనుంది. ప్రస్తుతం ఉన్న 59 kWh, 79 kWh బ్యాటరీల మధ్య ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఈ బ్యాటరీతో సుమారు 600 కిలోమీటర్ల రేంజ్ లభించే అవకాశం ఉంది. 242 bhp శక్తి, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉండనుంది.

⦿ విజన్ S  

Advertisement

ఇక మహీంద్రా గత ఏడాది ప్రదర్శించిన విజన్ S కాన్సెప్ట్ కూడా త్వరలో ప్రొడక్షన్ రూపంలో రానుంది. ఇది కంపెనీ కొత్త NU IQ ప్లాట్‌ ఫారమ్‌ పై ఆధారపడి రూపొందుతోంది. 4 మీటర్ల లోపు పొడవు కలిగిన ఈ SUV బాక్సీ డిజైన్‌తో ఆకట్టుకోనుంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ICE వెర్షన్ విడుదలైన కొంతకాలం తర్వాత ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా తీసుకురానున్నారు.

⦿ మహీంద్రా BE 07

అటు మహీంద్రా BE 07 పేరుతో మరో కొత్త ఎలక్ట్రిక్ SUVను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ మిడ్‌ సైజ్ ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. ప్రొడక్షన్ వెర్షన్ కాన్సెప్ట్ మోడల్‌ కు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఈ-విటారా, టయోటా రాబోయే ఎలక్ట్రిక్ SUVలకు పోటీ ఇవ్వనుంది.

Read Also: టాటా To మహీంద్రా.. రూ.40 లక్షల్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

Related News

మీ దగ్గర మారుతి ఇగ్నిస్ ఉందా? వెంటనే సర్వీస్ సెంటర్‌ కు వెళ్లండి భయ్యా!

టాటా To మహీంద్రా.. రూ.40 లక్షల్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

భారత్‌ లోకి MG క్రేజీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV.. దీపావళికి ముందే ఎంట్రీ!

స్కోడా పీక్ EV వచ్చేసింది.. 28 నిమిషాల్లో ఛార్జింగ్, 647KM రేంజ్!

ఇండియన్ మార్కెట్ లోకి స్కోడా కోడియాక్ RS ఎంట్రీ.. లిమిటెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!

ఒకే ఛార్జ్‌ తో 142 కి.మీ రేంజ్.. తక్కువ ధరలో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 129 కి.మీ రేంజ్.. లేటెస్ట్ ఫీచర్లతో మతిపోగొడుతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

Big Stories

×