E-Paper
Advertisement

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!
Advertisement

Maruti Upcoming Cars 2027: భారత కార్ల మార్కెట్లో మరింత దుమ్మురేపేందుకు మారుతి సుజుకి (Maruti Suzuki)  అదిరిపోయే ప్లాన్స్ చేస్తోంది. 2030 నాటికి దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం వాటాను తిరిగి పొందడమే లక్ష్యంగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ లాంటి డిఫరెంట్ పవర్‌ట్రెయిన్‌ లతో కొత్త కార్లను తీసుకురాబోతున్నది. ఈ నేపథ్యంలో 2027 ఫిబ్రవరిలో జరిగే భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్‌ పోలో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి మారుతి కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ (YMC), మరొకటి ఫేస్‌లిఫ్టెడ్ ఫ్రాంక్స్.

మూడు వరుసల సీట్లతో మారుతి ఎలక్ట్రిక్ ఎంపీవీ

మారుతి తీసుకురానున్న YMC ఎలక్ట్రిక్ ఎంపీవీ కంపెనీ నుంచి రాబోతున్న ప్రీమియం ఎలక్ట్రిక్ మోడళ్లలో ఒకటిగా నిలవనుంది. దీనిని నెక్సా (Nexa) డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మనున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది కియా కేరెన్స్ క్లావిస్ ఈవీకి పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Advertisement

ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉంది. బయటకు వచ్చిన స్పై షాట్స్ లో, ఎంపీవీ, ఎస్‌యూవీ డిజైన్ ఫీచర్లు కలిసినట్లు కనిపిస్తోంది. లాంగ్ రూఫ్‌ లైన్, పెద్ద గ్లాస్ ఏరియా, ఆకట్టుకునే వీల్ ఆర్చ్‌ లు, ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్, వెనుక టెయిల్ ల్యాంప్స్ లాంటి ప్రత్యేకతలు ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇక క్యాబిన్‌లో మూడు వరుసల సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ మారుతి ఈ-విటారా (e-Vitara)తో ప్లాట్‌ ఫామ్, బ్యాటరీ టెక్నాలజీని పంచుకునే అవకాశం ఉంది. ఈ-విటారాలో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. అయితే, YMC పరిమాణం, బరువును బట్టి దాని రేంజ్, పవర్ మారే అవకాశం ఉంది.

35 కిలోమీటర్ల మైలేజీతో కొత్త ఫ్రాంక్స్!

Advertisement

మరోవైపు మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ కూడా పలు మార్పులతో రానుంది. ఇందులో స్వల్ప డిజైన్ మార్పులతో పాటు కొత్త ఫీచర్లను యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్పై షాట్స్ ను చూస్తే, కొత్త గ్రిల్, అప్ డేట్ చేసిన ఫ్రంట్ బంపర్, ADAS రాడార్ సెన్సార్ లాంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కారులో లెవల్ 2 ADAS టెక్నాలజీ అందించే అవకాశం ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉండవచ్చు. వెనుక డిస్క్ బ్రేకులు కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త ఫ్రాంక్స్‌ లో 1.2 లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా రూపొందించిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను తీసుకురావచ్చని అంచనా. ఇది సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేయనుంది. ఈ హైబ్రిడ్ మోడల్ లీటరుకు 35 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇవ్వవచ్చని తెలుస్తోంది.

Read Also: అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

Tags

Related News

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

Big Stories

Advertisement
×