E-Paper
Advertisement

టాటా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. నెక్సాన్, కునోతో భారీ ప్లాన్!

టాటా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. నెక్సాన్, కునోతో భారీ ప్లాన్!
Advertisement

Tata New Electric SUVs: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు టాటా మోటార్స్ (Tata Motors) ప్లాన్స్ చేస్తోంది. ఇప్పటికే పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV లాంటి మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ SUVలను తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రయత్నిస్తోంది. వాటిలో ఒకటి నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్ EV కాగా, మరొకటి కునో EV. ఈ రెండు కార్లు టాటా ఎలక్ట్రిక్ SUV లైనప్‌ లో కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా పంచ్ EV, సియెర్రా EV మధ్యలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

కొత్త లుక్ లో నెక్సాన్ EV

టాటా నెక్సాన్ EVకి ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు దీని తర్వాత జెనరేషన్ మోడల్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్ SUVకి సంబంధించిన టెస్టింగ్ కూడా ప్రారంభమైనట్లు స్పై షాట్స్ వెల్లడిస్తున్నాయి. కొత్త మోడల్‌ లో డిజైన్ పరంగా కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాలమైన క్యాబిన్, మంచి సెకెండ్ రో సీటింగ్ స్పేస్, పెద్ద బూట్ స్పేస్ అందించేలా SUV లుక్ ను మార్చనున్నట్లు తెలుస్తోంది. మంచి కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ ను కూడా అందించే అవకాశం ఉంది. లేటెస్ట్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీతో ఈ SUV కొనుగోలుదారులను మరింతగా ఆకట్టుకోనుంది.

టాటా నుంచి కొత్త కునో ఎలక్ట్రిక్ SUV

Advertisement

ఈ రెండు మోడళ్లలో కునో EV స్పషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. సుమారు 4.3 మీటర్ల పొడవుతో రూపొందనున్న ఈ SUV, MG విండ్సర్ EV లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. కర్వ్ EVతో పోలిస్తే కునో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీటింగ్, రోజువారీ ప్రయాణాలకు అనువైన డిజైన్ దీని ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. నెక్సాన్ EV, సియెర్రా EV మిడిల్ లోకి ఈ కారు అడుగు పెట్టనుంది.

కునో EVలో అదిరిపోయే ఫీచర్లు!

కునో EV టాటా యాక్టి.ఈవీ (Acti.ev) ప్లాట్‌ ఫామ్‌పై తయారయ్యే అవకాశం ఉంది. గుజరాత్‌ లోని సనంద్ ప్లాంట్‌లో ఈ కారును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లాట్ ఫ్లోర్ ఉండటంతో ప్రయాణికులకు మంచి లెగ్‌రూమ్ లభించనుంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.  వెనుక సీట్లకు రిక్లైన్, స్లైడ్ సదుపాయాలతో పాటు లెవెల్ 2 ADAS టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉంది.

450 కిలోమీటర్లకు పైగా రేంజ్

Advertisement

బ్యాటరీ విషయంలోనూ కునో EV ఆకట్టుకునే అవకాశం ఉంది. కర్వ్ EV, సియెర్రా EV మోడళ్లలో ఉపయోగించే బ్యాటరీ ఆప్షన్లను ఇందులోనూ అందించే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే రేంజ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!

Tags

Related News

భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈసారి ఏకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో..

రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఫ్రాంక్స్.. బాలెనోను వెనక్కి నెట్టి మరీ సరికొత్త రికార్డు!

కొత్త బజాజ్ పల్సర్ RS200 విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

పెద్ద బ్యాటరీతో విండ్సర్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఇక రేంజ్ మామూలుగా ఉండదండోయ్!

కొనుగోలుదారులకు హీరో షాక్.. స్ప్లెండర్ ప్లస్ ధరలు భారీగా పెంపు!

Big Stories

Advertisement
×