E-Paper
Advertisement

టాటా నెక్సాన్, పంచ్ EVలకు పోటీగా విస్ట్ ఫాస్ట్ VF5.. మూడింటిలో ఏ కారు బెస్ట్ అంటే?

టాటా నెక్సాన్, పంచ్ EVలకు పోటీగా విస్ట్ ఫాస్ట్ VF5.. మూడింటిలో ఏ కారు బెస్ట్ అంటే?
Advertisement

VinFast VF5 vs Tata Nexon EV, Punch EV: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి మరో కొత్త కంపెనీ అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. వియత్నాంకు చెందిన పాపులర్ ఆటో మేకర్ విన్ ఫాస్ట్ (VinFast) VF5 ఎలక్ట్రిక్ SUVని వచ్చే ఏడాది దేశీ మార్కెట్లోకి తీసుకురానుంది. 43kWh బ్యాటరీతో రానున్న ఈ కారు.. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా నెక్సాన్ EV, పంచ్ EVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, పవర్, ఫీచర్ల విషయంలో ఈ మూడు కార్లలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందా..

సైజులో ఏ కారు ఎలా ఉందంటే?   

విన్ ఫాస్ట్ VF5 పొడవు 3,987 మిమీ. దాదాపు 3,995 మిమీ పొడవున్న టాటా నెక్సాన్ EVకి దగ్గరగా ఉంటుంది. అయితే, పంచ్ EVతో పోలిస్తే VF5 వెడల్పుగా, ఎత్తుగా ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,513 మిమీ కాగా, నెక్సాన్ EVలో 2,498 మిమీగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో టాటా కార్లు ముందున్నాయి. VF5లో 178 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఉంది. నెక్సాన్ EVలో 190 మిమీ, పంచ్ EVలో 195 మిమీ ఉంది. బూట్ స్పేస్ కూడా VF5లో 335 లీటర్లు ఉండగా టాటా కార్లు ముందున్నాయి.

బ్యాటరీ, పవర్, రేంజ్ లో ఎవరు ముందు? 

Advertisement

VF5 ప్రీమియం వేరియంట్‌ లో 43kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది నెక్సాన్ EVలోని 45kWh బ్యాటరీ కంటే కొంచెం తక్కువ. పంచ్ EVలోని 40kWh బ్యాటరీ కంటే ఎక్కువ. పవర్ విషయానికి వస్తే, VF5 ఎలక్ట్రిక్ మోటార్ 96bhp శక్తిని, 180Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ EV 142bhp, 215Nmతో ముందుంది. పంచ్ EV 127bhp పవర్, 154Nm టార్క్‌ ను అందిస్తుంది.

రేంజ్ విషయానికి వస్తే.. విన్ ఫాస్ట్ VF5 ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 370 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. నెక్సాన్ EV 45, పంచ్ EV 40 మోడళ్లు 489 కిలోమీటర్లు, 468 కిలోమీటర్ల రేంజ్ ప్రకటించాయి.

ఫీచర్లలో టాటా నెక్సాన్ EV ముందు!

Advertisement

విన్ ఫాస్ట్ VF5 ప్రీమియం వేరియంట్‌ లో 10 అంగుళాల టచ్‌ స్క్రీన్, ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, సరౌండ్ వ్యూ మానిటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే కూడా ఉన్నాయి. అయితే, టాటా నెక్సాన్ EV టాప్ వేరియంట్‌ లో మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 2 ADAS లాంటి సదుపాయాలు ఉన్నాయి.

పంచ్ EVలోనూ అదిరిపోయే ఫీచర్లు 

పంచ్ EVలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీలో VF5 పోటీనిచ్చినా, పవర్, రేంజ్, ఫీచర్ల విషయంలో టాటా మోడళ్లు ముందున్నాయి.

Read Also: టాటా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. నెక్సాన్, కునోతో భారీ ప్లాన్!

Tags

Related News

టాటా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. నెక్సాన్, కునోతో భారీ ప్లాన్!

భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈసారి ఏకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో..

రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఫ్రాంక్స్.. బాలెనోను వెనక్కి నెట్టి మరీ సరికొత్త రికార్డు!

కొత్త బజాజ్ పల్సర్ RS200 విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

పెద్ద బ్యాటరీతో విండ్సర్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఇక రేంజ్ మామూలుగా ఉండదండోయ్!

Big Stories

Advertisement
×