E-Paper
Advertisement

భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!

భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!
Advertisement

BYD India Sales: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD భారత మార్కెట్‌ లో మరో మైల్ స్టోన్ క్రాస్ చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 వేల ఎలక్ట్రిక్ కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది. కేవలం ఏడాదిలోనే  అమ్మకాలను డబుల్ చేసుకొని సత్తా చాటింది.

ఏడాదిలోనే 10 వేల నుంచి 20 వేల యూనిట్లకు..

BYD ఇండియా 2025 సెప్టెంబర్ నాటికి దేశంలో 10,000 వాహనాలను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. ఆ తర్వాతి ఏడాది కాలంలో మరో 10,000 కార్లను కస్టమర్లకు అందించి, మొత్తం డెలివరీల సంఖ్యను 20 వేలకు చేర్చింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని PPS BYD షోరూమ్‌లో స్పెషల్ ఈవెంట్ ను నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో BYD ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ రాజీవ్ చౌహాన్, నేషనల్ సేల్స్ హెడ్ శ్రీరంగ జోషి 20,000వ వెహికల్ ను యజమానికి అందజేశారు.

ఈ రెండు మోడళ్లకు ఎక్కువ ఆదరణ

Advertisement

ప్రస్తుతం BYD ఇండియా భారత మార్కెట్‌ లో పలు ఎలక్ట్రిక్ కార్లను అమ్ముతోంది. eMax7 MPV, Atto 3, Sealion 7, Seal మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో Atto 3, Sealion 7 మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. Atto 3 ఇప్పటి వరకు 9,000 యూనిట్లకు పైగా అమ్ముడు కాగా, Sealion 7 మోడల్ 5,000 యూనిట్ల మార్కును దాటింది. ఈ రెండు కార్లు BYD ఇండియా మొత్తం అమ్మకాల్లో కీ రోల్ పోషిస్తున్నాయి.

లగ్జరీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ

సాధారణ ఎలక్ట్రిక్ కార్లతో పాటు లగ్జరీ మార్కెట్‌ పైనా BYD ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా డెంజా బ్రాండ్ కింద D9 MPV, Z9 GT షూటింగ్ బ్రేక్ మోడళ్లను మార్కెట్ కు పరిచయం చేసింది. అంతేకాకుండా,  DM-i ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా భారత మార్కెట్‌కు పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ టెక్నాలజీతో రూపొందనున్న Seal-U SUVని 2027 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావచ్చని కంపెనీ వెల్లడించింది.

డీలర్‌షిప్ నెట్‌వర్క్ మరింత విస్తరణ

Advertisement

20 వేల కార్ల డెలివరీ మైల్ స్టోన్ క్రాస్ చేయడం పట్ల సేల్స్ హెడ్ శ్రీరంగ జోషి సంతోషం వ్యక్తం చేశారు. వినియోగదారులు తమ బ్రాండ్‌ మీద ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు మరింత మంది కస్టమర్లకు చేరువ కావడంతో పాటు, దేశవ్యాప్తంగా డీలర్‌ షిప్ నెట్‌ వర్క్‌ ను విస్తరించనున్నట్లు తెలిపారు. భారత్‌ లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో BYD మరింత సత్తా చాటే అవకాశం ఉంటుంది.

Read Also: రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!

Tags

Related News

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈసారి ఏకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో..

రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఫ్రాంక్స్.. బాలెనోను వెనక్కి నెట్టి మరీ సరికొత్త రికార్డు!

కొత్త బజాజ్ పల్సర్ RS200 విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

పెద్ద బ్యాటరీతో విండ్సర్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఇక రేంజ్ మామూలుగా ఉండదండోయ్!

కొనుగోలుదారులకు హీరో షాక్.. స్ప్లెండర్ ప్లస్ ధరలు భారీగా పెంపు!

కొత్త కార్లు, బైక్‌లకు పేర్లు ఎలా పెడతారు? బాబోయ్.. ఇంత ప్రాపెస్ ఉంటుందా?

Big Stories

Advertisement
×