Rawalkole Dog Attack: అయ్యో! గొర్రెల కాపరి కృష్ణ యాదవ్‌కు ఎంత కష్టమొచ్చింది! ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. జీవాల మీద ఆధారపడి బతికే పేదోడికి వీధి కుక్కలు తీరని కడుపుకోట మిగిల్చాయి.
ఎందుక ఈ దారుణం జరిగింది?
గ్రామంలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్ల పక్కన, ఇష్టానుసారంగా పడేయడమే ఈ అనర్థానికి అసలు కారణం. ఆ వ్యర్థాలను తినడానికి వీధి కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి. అలా తిని తిని మరింత మందకొడిగా, క్రూరంగా మారుతున్న ఆ కుక్కలు.. చివరికి మూగజీవాల ప్రాణాల మీదకు వస్తున్నాయి.
పది గొర్రెలు మృతి.. తీవ్ర నష్టం
రోజూలాగే గొర్రెలను కాపలా కాస్తున్న మేందె కృష్ణ యాదవ్ మందపైకి గుంపులుగా దూసుకొచ్చిన వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో సుమారు 10 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన వల్ల తనకు దాదాపు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఉన్న ఉపాధి పోవడంతో కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అధికారులు ఇప్పటికైనా స్పందించాలి
ఇప్పటికే రావల్‌కోల్‌లో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి, నిబంధనలు పాటించని చికెన్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల నివారణకు తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, నష్టపోయిన గొర్రెల కాపరి కృష్ణ యాదవ్‌కు ప్రభుత్వం అండగా నిలిచి తగిన ఆర్థిక పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: రాప్తాడు ఘటనలో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు!