E-Paper
Advertisement

దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!

దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!
Advertisement

Diwali Car Discounts 2026: దీపావళి పండుగ సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, పండుగ సీజన్‌లో కార్ల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా టాటా, సిట్రోయెన్, మారుతి సుజుకి కంపెనీలకు చెందిన కొన్ని కార్లపై అదిరిపోయే బెనిఫిట్స్  అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లతో కొనుగోలుదారులు ఏకంగా రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ లిస్టులో ఎలక్ట్రిక్ కార్లతో పాటు పెట్రోల్ కార్లు కూడా ఉన్నాయి. టాటా టియాగో ఈవీపై అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. పండుగ సందర్భంగా ఏ కారు మీద ఎంత తగ్గింపు ఉందో తెలుసుకుందాం.

టాటా టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకు తగ్గింపు

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా టియాగో ఈవీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ కారుపై గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎంచుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది.

సిట్రోయెన్ C3పై రూ.1.18 లక్షల వరకు ఆఫర్

Advertisement

సిట్రోయెన్ కంపెనీకి చెందిన C3 హ్యాచ్‌బ్యాక్‌పై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ కారును కొనుగోలు చేసే వారికి  రూ.1.18 లక్షల వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి. ఆకట్టుకునే డిజైన్, సౌకర్యవంతమైన ఫీచర్లు కోరుకునే వారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది.

మారుతి స్విఫ్ట్‌ పై రూ.71 వేల వరకు డిస్కౌంట్

భారత మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న మారుతి స్విఫ్ట్‌పై దీపావళి సందర్భంగా రూ.71 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. స్టైలిష్ లుక్, మంచి మైలేజీ కోరుకునే కొనుగోలుదారులకు ఈ ఆఫర్ క్రేజీగా ఆకట్టుకుంటుంది.

మారుతి సెలెరియోపై రూ.67,500 వరకు తగ్గింపు

Advertisement

మారుతి సెలెరియో కొనాలనుకునే వారికి కూడా కంపెనీ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ కారుపై గరిష్ఠంగా రూ.67,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మంచి మైలేజీతో పాటు తక్కువ ధరలో కారు కోరుకునే వారికి బాగుంటుంది.

మారుతి వాగన్ ఆర్ పై రూ.67 వేల వరకు ఆఫర్

మారుతి వాగన్ ఆర్ పై కూడా రూ.67 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. విశాలమైన క్యాబిన్, ఈజీ డ్రైవింగ్, కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండే డిజైన్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

కారు కొనేముందు ఏం చేయాలంటే? 

దీపావళి సందర్భంగా ప్రకటించిన ఈ డిస్కౌంట్లు కారు మోడల్, వేరియంట్, నగరం, డీలర్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అదే సమయంలో  స్టాక్ ను బట్టి కూడా ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది. కొత్త కారు కొనుగోలు చేసే ముందు దగ్గరలోని డీలర్‌ ను కలిసి  పూర్తి ఆఫర్ వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

Tags

Related News

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

భారత్ లోకి డెంజా Z9 GT.. లాంచ్‌ కు ముందే టీజర్ రిలీజ్!

ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..

ట్యూబ్‌ లెస్ స్పోక్ వీల్స్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బైక్ విశేషాలు ఇవే!

ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×