E-Paper
Advertisement

హైబ్రిడ్ SUVలపై హ్యుందాయ్, కియా ఫోకస్.. అదిరిపోయే మోడళ్లు రెడీ!

హైబ్రిడ్ SUVలపై హ్యుందాయ్, కియా ఫోకస్.. అదిరిపోయే మోడళ్లు రెడీ!
Advertisement

Hyundai- Kia New Hybrid SUVs: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హైబ్రిడ్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హ్యుందాయ్, కియా కంపెనీలు కొత్త హైబ్రిడ్ మోడళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. రాబోయే 9 నుంచి 12 నెలల్లో ఈ రెండు కంపెనీలు పలు కొత్త హైబ్రిడ్ SUVలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.

ముందుగా కియా సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే హ్యుందాయ్ క్రెటా న్యూ జెనరేషన్ మోడల్ 2027 మధ్య నాటికి హైబ్రిడ్ వెర్షన్‌ తో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ దేశంలో హ్యుందాయ్ నుంచి వచ్చే తొలి హైబ్రిడ్ వాహనం కానుంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు తమ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే సెల్టోస్, క్రెటాలో ఇప్పటికే ఉపయోగిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ను హైబ్రిడ్ టెక్నాలజీతో అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

ఇక హ్యుందాయ్ కొత్తగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇంజన్‌ ను భవిష్యత్ మోడళ్లలో ఉపయోగించే అవకాశం ఉంది. తొలుత బేయాన్ అనే కొత్త క్రాసోవర్‌ లో ఈ పవర్‌ ట్రెయిన్‌ ను అందించే అవకాశముందని తెలుస్తోంది. న్యూ జెనరేషన్ క్రెటా కూడా మరింత అత్యాధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లతో రానుంది. టెస్ట్ మోడళ్ల ఆధారంగా చూస్తే, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, కొత్త ADAS భద్రతా ఫీచర్లు, ఆకర్షణీయమైన LED లైటింగ్ సెటప్ లాంటి అప్‌ డేట్స్ ఇందులో ఉండనున్నాయి. ప్రస్తుత మోడల్‌ తో పోలిస్తే సైజ్ కూడా మరింత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్, కియా రెండూ 7-సీటర్ హైబ్రిడ్ SUVలపై కూడా పని చేస్తున్నాయి. హ్యుందాయ్ మూడు వరుసల SUVను రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల ధర పరిధిలో తీసుకురావచ్చని అంచనా. ఇది పెద్ద కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో కియా కూడా తన ప్రీమియం 7 సీటర్ హైబ్రిడ్ SUVను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.30 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మోడల్ భారత మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ లాంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా క్రెటా, సెల్టోస్ హైబ్రిడ్ మోడళ్లు సాధారణ పెట్రోల్ వెర్షన్ల కంటే సుమారు రూ.2 లక్షల వరకు ధర పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ మెరుగైన మైలేజ్, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, అత్యాధునిక సాంకేతికత కారణంగా ఈ వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆటో ఇండస్ట్రీ భావిస్తోంది.

Read Also: డ్రైవింగ్ రాకపోయినా నో టెన్షన్.. ఇక హ్యాపీగా కారులో వెళ్లొచ్చు!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×