E-Paper
Advertisement

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

New Maruti Baleno and Fronx Facelifts: మారుతి సుజుకి భారత మార్కెట్లో మరో రెండు క్రేజీ కార్లను సరికొత్తగా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రీసెంట్ గా బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్‌ ను పరిచయం చేసిన కంపెనీ, ఇప్పుడు బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసే పనిలో పడింది. ఇప్పటికే ఈ రెండు కార్ల టెస్టింగ్ కొనసాగుతుండగా, దీపావళి పండుగ సీజన్‌ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  కొత్త మోడళ్లలో డిజైన్‌తో పాటు ఇంటీరియర్, టెక్నాలజీ, ఫీచర్లలో కూడా పలు మార్పులు ఉండనున్నాయి. వినియోగదారులకు మరింత అత్యాధునిక అనుభవాన్ని అందించాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

బాలెనో ఫేస్‌ లిఫ్ట్‌ లో కొత్త ఏంటి?  

కొత్త బాలెనోలో బయటకు కనిపించే మార్పులు పెద్దగా లేకపోయినా, ముందు భాగంలో కొత్త గ్రిల్, సన్నని క్రోమ్ స్ట్రిప్, మారిన హెడ్‌ల్యాంప్ డిజైన్, కొత్త ఫాగ్ ల్యాంప్ సెటప్ లాంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది. దీంతో కారు మరింత ప్రీమియం లుక్‌ను సంతరించుకోనుంది. ఇంటీరియర్‌ లో కూడా కొన్ని అప్‌ డేట్లు ఉండనున్నాయి. కొత్త డ్యాష్‌ బోర్డ్ డిజైన్, మెరుగైన మెటీరియల్ క్వాలిటీతో పాటు పెద్ద 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే సపోర్ట్ ఉంటుంది. అలాగే హెడ్ అప్ డిస్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది.

Advertisement

ఇంజిన్ విషయంలో కూడా మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో, కొత్త స్విఫ్ట్‌ లో ఉన్న 1.2 లీటర్ మూడు సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ ను అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్‌ తో 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌ బాక్స్ ఆప్షన్స్ ఉండొచ్చని తెలుస్తోంది.

ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్‌ లో మరిన్ని అప్‌డేట్స్

ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్‌ లో డిజైన్ పరంగా మరింత స్పష్టమైన మార్పులు కనిపించనున్నాయి. కొత్త బంపర్లు, రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త హెడ్‌ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త టెయిల్‌ ల్యాంప్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లోపల 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త సీటు అప్హోల్స్టరీ లాంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. టాప్ వేరియంట్‌ లో ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్ కూడా అందించే అవకాశముంది. అంతేకాకుండా, ఫ్రాంక్స్‌ లో లెవెల్-2 ADAS టెక్నాలజీని కూడా తీసుకురావచ్చని స్పై షాట్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ లాంటి భద్రతా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లను కొనసాగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ కారుకు స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ ను కూడా తీసుకురావాలని మారుతి భావిస్తోంది. అయితే ఆ మోడల్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Read Also: థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!

Related News

ఈవీ మార్కెట్‌లో సరికొత్త సంచలనం.. సింపుల్ అరైవ్ వస్తోంది!

డుకాటి లవర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త మాన్‌స్టర్ లాంచ్‌కు గ్రీన్ సిగ్నల్!

మారుతి బ్రెజ్జా సూపర్ హిట్.. 15 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!

హోండా సంచలన నిర్ణయం.. భారత్ నుంచే ప్రపంచానికి కొత్త బైక్స్ ఎగుమతులు!

కొత్త టయోటా హిలక్స్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

Big Stories

Advertisement
×