E-Paper
Advertisement

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!
Advertisement

Upcoming E-Scooters: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనరంగంలో కొత్త శకానికి నాంది పడబోతోంది. రాబోయే కొద్ది నెలల్లోనే దిగ్గజ కంపెనీలు సరికొత్త ఫీచర్లు, మెరుగైన రేంజ్‌తో ఐదు అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. కొత్తగా ఈవీ స్కూటర్ కొనే ప్లాన్ లో ఉన్నవారికి ఇది గోల్డెన్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంతకీ మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి ఫీచర్లు ఎలా ఉండనున్నాయో ఈ కథనంలో చూద్దాం.

1. హోండా క్యూసీ3 (Honda QC3)

హోండా తన ప్రతిష్టాత్మకమైన ‘QC3’ స్కూటర్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఇది 3kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉండి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 145 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, TFT డిస్‌ప్లేతో ఇది ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

2. ఏథర్ ఈఎల్ (Ather EL01)

Advertisement

ఏథర్ ఎనర్జీ ఆగస్టు 29న తన ‘కమ్యూనిటీ డే’ వేదికగా సరికొత్త ‘ఏథర్ EL01’ ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. ఇది సుమారు 120 కిమీ రేంజ్‌ మైలేజీని అందించడమే కాకుండా.. అధునాతన ఏథర్‌స్టాక్ 7.0 సాఫ్ట్‌వేర్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లతో రానుంది.

3. సింపుల్ అరైవ్ (Simple Arrive)

సింపుల్ ఎనర్జీ సెప్టెంబర్ 2న ‘అరైవ్’ (Arrive) స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా నిలవనుంది. మహిళలు, పెద్దవారు సైతం ఏంతో ఈజీగా నడిపేలా ఈ స్కూటర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా, అత్యాధునిక ఎల్‌ఈడీ లైటింగ్‌తో రానుండటం గమనార్హం.

4. అల్ట్రా వయొలెట్ టెస్సరాక్ట్ (Ultraviolette Tesseract)

Advertisement

హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. 2027 జనవరిలో రాబోయే ఈ స్కూటర్.. 100V ఆర్కిటెక్చర్‌తో వస్తున్న తొలి ఇండియన్ స్కూటర్. 15kW మోటార్‌తో ఇది 125 కిమీ గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

Also Read: నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

5. విన్‌ఫాస్ట్ వైపర్ ఈ (VinFast Viper E)

ప్రముఖ విదేశీ బ్రాండ్.. విన్‌ఫాస్ట్ నుంచి రాబోతున్న ‘వైపర్ ఈ’ ఒక మ్యాక్సీ-స్కూటర్. ఇది 156 కిమీల భారీ రేంజ్, స్వాపబుల్ (మార్చుకోగలిగే) బ్యాటరీ సౌకర్యంతో రానుంది. దీనికి ఉన్న వాటర్ రెసిస్టెన్స్ (IP67) ఫీచర్.. వర్షాకాలంలో ఇండియన్ రోడ్లపై నడిపేందుకు అనుకూలంగా ఉండనుంది.

Also Read: సినిమాలు, జూలో కాకుండా.. పులిని అడవిలో చూడాలా? ఈ ప్రాంతాలకు వెళ్లు మామ!

Related News

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

Big Stories

Advertisement
×