E-Paper
Advertisement

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!
Advertisement

Best CNG Cars 2026: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. వాహనదారులకు ఈవీలతో పాటు సీఎన్ జీ (CNG) కార్లు సైతం ఊరట కలిగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే సీఎన్ జీ కార్ల నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 10 లక్షల బడ్జెట్‌లో మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ సీఎన్‌జీ కార్ల వివరాలను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

సీఎన్‌జీ కారునే ఎందుకు కొనాలి?

పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే.. సీఎన్‌జీ ఖర్చు చాలా తక్కువ. కిలో సీఎన్‌జీకి 30 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే కార్లను వాడటం వల్ల రోజువారీ ప్రయాణ ఖర్చులు దాదాపు మూడో వంతుకి తగ్గిపోతాయి. అంతేకాకుండా కంపెనీ ఫిటెడ్ సీఎన్‌జీ వాహనాల వల్ల.. ఆటోమొబైల్ సంస్థల వారంటీ, తేడా వస్తే సర్వీసింగ్ ఫ్రీగా పొందొచ్చు.

మారుతి సుజుకి ఆల్టో K10

Advertisement

రూ. 4.81 లక్షల నుంచి రూ. 5.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉన్న ఆల్టో K10 కారు.. బడ్జెట్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్. 1.0 లీటర్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు.. కేజీ సీఎన్‌జీకి ఏకంగా 33.85 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ఆఫీసు ప్రయాణాలకు.. మొదటిసారి కారు కొనేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది.

మారుతి సుజుకి సెలెరియో

మైలేజ్ విషయంలో తిరుగులేని కారు మైక్రో హ్యాచ్‌బ్యాక్ సెలెరియో. ఇది కిలో సీఎన్‌జీకి ఏకంగా 34.43 కి.మీ మైలేజ్ అందిస్తూ దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా నిలిచింది. దీని ప్రారంభ ధర రూ. 5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాటా పంచ్ సీఎన్‌జీ

Advertisement

ఎస్‌యూవీ (SUV) లుక్ కోరుకునే వారి కోసం టాటా పంచ్ సీఎన్‌జీ ఎంతగానో ఉపయోగపడుతుంది. 1.2 లీటర్ ఇంజిన్‌తో వచ్చే ఈ వాహనం.. 26.9 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లతో రావడం వల్ల బూట్ స్పేస్ కూడా ఎక్కవ పొందొచ్చు. దీని ధర రూ. 6.80 లక్షల నుండి ప్రారంభం కానుంది.

హ్యుందాయ్ ఎక్స్టర్

ఆధునిక ఫీచర్లు, ఎస్‌యూవీ స్టైలింగ్ కలగలిపిన హ్యుందాయ్ ఎక్స్టర్.. 27.10 కి.మీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన హంగులతో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7 లక్షలుగా ఉంది.

Also Read: కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

టయోటా గ్లాంజా

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అనుభూతిని కోరుకునే వారికి టయోటా గ్లాంజా బెస్ట్ ఛాయిస్. స్టైలిష్ క్యాబిన్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ఇది 30.61 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Also Read: ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

Related News

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

Big Stories

Advertisement
×