New Norton 454 Roadster: ప్రముఖ బ్రిటిష్ టూవీలర్ బ్రాండ్ నార్టన్.. బైక్ లవర్స్ కు గుడ్‌న్యూస్ చెప్పింది. 454cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో రూపొందిస్తున్న కొత్త రోడ్‌స్టర్ బైక్‌ను EICMA వేదికగా పరిచయం చేసింది. ఈ కొత్త బైక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది. అయితే, ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం చూస్తే ఈ బైక్ మార్కెట్లో మంచి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
కొత్త నార్టన్ రోడ్‌స్టర్‌లో 454cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 45Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, బైక్ ఎంత హార్స్ పవర్‌ను అందిస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇంజన్ పనితీరుకు సంబంధించి మరిన్ని వివరాలలను త్వరలో వెల్లడికానున్నాయి.
ఈ బైక్‌లో అల్యూమినియం ఛాసిస్ ను అందిస్తున్నారు. ఈ విభాగంలో ఇది ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు. నార్టన్ అట్లాస్ మోడళ్లలో కనిపించే ఫ్రేమ్ డిజైన్‌తో ఇది కొంతవరకు పోలి ఉంది. అలాగే బైక్‌కు 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో USD ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ సెటప్ ఉండవచ్చని అంచనా. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు అందించే అవకాశం ఉంది.
ఫీచర్ల పరంగా కూడా నార్టన్ కొత్త బైక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో 8 ఇంచుల TFT డిస్‌ప్లేను అందించనున్నారు. కంపెనీకి చెందిన మ్యాంక్స్ R, అట్లాస్ మోడళ్లలోనూ ఇలాంటి డిస్‌ప్లే కనిపిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి వెనుక భాగం వరకు ఆకట్టుకునే బాడీ ప్యానెల్ ఉంటుంది. చిన్న టెయిల్ సెక్షన్, కాంపాక్ట్ సీటు ఈ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన ఫోటోలో ఈ బైక్ పెర్ల్ లిలాక్ రంగులో కనిపిస్తోంది.
భారత మార్కెట్లోకి నార్టన్ కొత్త బైక్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. TVS భాగస్వామ్యంతో ఈ బైక్ ను ను హోసూర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సమాచారం. నార్టన్ బైక్‌లను భారత్‌లో 2027 జనవరి-మార్చి మధ్య విడుదల చేయాలని TVS భావిస్తోంది. మొదట అట్లాస్, ఆ తర్వాత మ్యాంక్స్ మోడళ్లను తీసుకురావాలని భావిస్తోంది. ఇక ఈ 454cc సింగిల్ సిలిండర్ బైక్ మాత్రం 2027 సెకెండాఫ్ లో భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. నార్టన్ ఇప్పటికే భారత్‌లో రోవెన్, ఇంటర్, అవలాన్ పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ కొత్త రోడ్‌స్టర్‌కు వీటిలో ఏదైనా పేరు పెట్టే అవకాశం ఉంది.
Read Also: క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్ కు కళ్లు చెదిరే డిమాండ్, జస్ట్ 6 నిమిషాల్లోనే అన్నీ సేల్!