E-Paper
Advertisement

BYD సంచలనం.. ఈ కారు రోడ్లపైనే కాదు.. నీళ్లలోనూ దూసుకెళ్తుంది!

BYD సంచలనం.. ఈ కారు రోడ్లపైనే కాదు.. నీళ్లలోనూ దూసుకెళ్తుంది!
Advertisement

BYD Yangwang U8: కారు అంటే రోడ్లపై ప్రయాణించడానికి మాత్రమే అనుకుంటున్నారా? అయితే, మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. రీసెంట్ గా టెస్లా ఎగిరే కారును అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD నీటిపైనా పరుగులు కారును రూపొందించింది. యాంగ్‌వాంగ్ U8 పేరుతో ఈ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. లగ్జరీ, అత్యాధునిక టెక్నాలజీ, అసాధారణ సామర్థ్యాలతో ఈ SUV ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

నీటిపై తేలియాడే SUV.. ఎలా పనిచేస్తుంది?

BYD 2023లో యాంగ్‌వాంగ్ U8ను పరిచయం చేసింది. ఈ SUVలో ఉన్న ప్రత్యేక సాంకేతికత కారణంగా వరదలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో నీటిపై తేలియాడే సామర్థ్యం ఉంది. సాధారణ కార్ల మాదిరిగా నీటిలో మునిగిపోకుండా, ప్రత్యేకంగా రూపొందించిన వ్యవస్థ సాయంతో కొంత సమయం పాటు నీళ్లతో తేలుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ SUV సుమారు 30 నిమిషాల వరకు నీటిపై తేలియాడుతుంది. అంతేకాదు, నీటిలో గంటకు 1.8 మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. అంటే నీటిలో చిక్కుకున్నప్పుడు ప్రయాణికులు సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే, ఇది సాధారణంగా నీటిలో ప్రయాణించడానికి రూపొందించిన పడవ లాంటిది కాదు. అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించాలి.

ట్యాంక్ టర్న్ ఫీచర్ మరో ప్రత్యేకత

Advertisement

యాంగ్‌వాంగ్ U8లో మరో ఆసక్తికరమైన ఫీచర్ ట్యాంక్ టర్న్. ఈ టెక్నాలజీ సాయంతో SUV చాలా తక్కువ స్థలంలోనే, దాదాపు తన స్థానంలోనే తిరుగుతుంది. ఆఫ్‌రోడ్ ప్రయాణాల్లో, ఇరుకైన ప్రాంతాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ SUVలో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ప్రతి వీల్ కు స్వతంత్రంగా పవర్ ను అందించే వ్యవస్థ కారణంగా వెహికల్ మెరుగైన కంట్రోల్ ను కలిగి ఉంటుంది. క్లిష్టమైన రోడ్లు, బురద, ఇసుక లాంటి ప్రాంతాల్లోనూ ప్రయాణించేందుకు ఇది సాయపడుతుంది.

పవర్, రేంజ్‌లోనూ అదుర్స్

యాంగ్‌వాంగ్ U8 కేవలం నీటిపై ప్రయాణించే ఫీచర్‌ మాత్రమే కాదు, దీని పనితీరు కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ SUV పవర్‌ట్రెయిన్ గరిష్ఠంగా సుమారు 1,200 హార్స్‌ పవర్ శక్తిని అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు పెట్రోల్ ఇంజిన్ జనరేటర్‌గా పనిచేసే ఎక్స్‌టెండెడ్ రేంజ్ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు. ఒక్కసారి ఛార్జింగ్, ఇంధనంతో కలిపి సుమారుగా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అయితే, వాస్తవ రేంజ్ డ్రైవింగ్ పరిస్థితులు, వేరియంట్, టెస్టింగ్ ప్రమాణాలను బట్టి మారే అవకాశం ఉంటుంది.

ఫ్యూయరిస్టిక్ కార్లకు కొత్త దారి..

Advertisement

ఎగిరే కార్లపై టెస్లా సహా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో BYD నీటిపై తేలియాడే SUVతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇలాంటి టెక్నాలజీ అత్యవసర సమయాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో కార్లు కేవలం రోడ్లపైనే కాకుండా, విభిన్న పరిస్థితులను ఎదుర్కొనేలా అభివృద్ధి చెందుతున్నాయనే విషయానికి యాంగ్‌వాంగ్ U8 బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.

Read Also: సఫారీ EV To అవిన్య X.. టాటా నుంచి రాబోతున్న 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

Tags

Related News

సఫారీ EV To అవిన్య X.. టాటా నుంచి రాబోతున్న 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

భారత్‌ లోకి బేబీ ల్యాండ్ క్రూయిజర్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్ కు కళ్లు చెదిరే డిమాండ్, జస్ట్ 6 నిమిషాల్లోనే అన్నీ సేల్!

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

Big Stories

Advertisement
×