Virender Sehwag On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. శుభమాన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్ల నుంచి ఏడవ స్థానం వరకు అద్భుతంగా ఆడే ఆటగాళ్లే ఉన్నారు. కానీ బౌలింగ్ లో మాత్రం టీమిండియా చాలా బలహీనంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్ తప్ప అనుభవం ఉన్న బౌలర్లు కనిపించడం లేదు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ) వన్డే సిరీస్ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్ గెలవాలని తాను ఆశపడుతున్నట్టు తెలిపాడు. వన్డే సిరీస్ నేపథ్యంలో బ్యాటింగ్ లో బలంగా టీమ్ ఇండియా ఉన్నప్పటికీ.. బౌలర్లను చూస్తేనే భయమేస్తోందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఊరు, పేరు తెలియని గుర్నూర్, అకీబ్ నబీ, అన్షుల్ కంబోజ్ లాంటి అనామక బౌలర్లను ఈ సిరీస్ కు సెలెక్ట్ చేశారని ఆగ్రహించాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు ఎదురు దాడి చేస్తే ఈ బౌలర్లు ప్యాంట్లు తడిపేసుకుంటారని హెచ్చరించాడు. మహమ్మద్ సిరాజ్ మినహా అనుభవమైన బౌలర్ ఎవడు కూడా టీమిండియాలో లేడని ఆగ్రహించాడు. సిరాజ్ కూడా ఒకవేళ గాయపడితే టీమిండియా సంకనాకి పోవడం గ్యారెంటీ అని హెచ్చరించాడు.
భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా లాంటి వాళ్లను పక్కకు పెట్టి ఈ వెధవలను ఎందుకు తీసుకువచ్చారని వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి వన్డే మ్యాచ్ టీమిండియా కు చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఇలాంటి క్రమంలో కొత్త బౌలర్లతో ప్రయోగాలు చేస్తే ఫలితాలు రాబోవు అని తెలిపాడు. టి20 క్రికెట్ లో భువనేశ్వర్ కుమారే దరాళంగా పరుగులు ఇచ్చాడు అంటే.. ఇప్పుడు ఈ వన్డే సిరీస్ లో కొత్త కుర్రాళ్ళు విఫలం కావడం గ్యారెంటీ అని హెచ్చరించాడు. ఈ వన్డే సిరీస్ టీమ్ ఇండియా గెలుస్తుందనే నమ్మకం తనకు లేదని బాంబు పేల్చాడు వీరేంద్ర సెహ్వాగ్.