Radhika Apte:రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాధిక ఆప్టే(Radhika Apte) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె ఇటీవల నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అక్క(Akka ) కోసం మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలు పంచుకుంది. అందులో భాగంగానే బాలయ్య (Balakrishna) తో నటించిన లెజెండ్ చిత్రంపై కూడా ఆమె కామెంట్లు చేయడంతో ఇప్పుడు బాలయ్య అభిమానులు ఈమె మీద మండిపడుతున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
రాధిక ఆప్టే మాట్లాడుతూ..” గతంలో నేను తెలుగులో చేసిన ఒక చిత్రంలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో నేను రొమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు కథలో సొంత మేన బావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. పైగా సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేశారు” అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఆమె ఏ సినిమా గురించి చెబుతోంది ? ఏ హీరో గురించి చెబుతోంది? అనే పేరును ప్రస్తావించకపోయినప్పటికీ నందమూరి బాలకృష్ణ హీరోగా , బోయపాటి శ్రీను (Boyapati srinu) దర్శకత్వంలో 2014లో నటించిన లెజెండ్ సినిమా గురించే ఆమె ఈ వ్యాఖ్యలను చేసిందని ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రంలో రాధిక ఆప్టే బాలకృష్ణకు మరదలి పాత్రలో కనిపించగా.. ఫ్లాష్ బ్యాక్ లో ఆమె పాత్రను విలన్లు అంతమొందిస్తారు. అలా ఆ పాత్రను ఆమె ఇప్పుడు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది.
ఇకపోతే రాధిక ఆప్టే మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలయ్య అభిమానులు, ఇటు నెటిజన్స్ ఆమె తీరుపై మండిపడుతున్నారు. కథ నచ్చకపోతే , పెద్ద హీరోతో నటించడం ఇష్టం లేకపోతే ఒప్పుకోవడం ఎందుకు? కథ వినకుండా హీరో ఎవరు అనేది తెలియకుండానే మీరు అగ్రిమెంట్ పై సంతకం చేశారా? అంటూ మండిపడుతున్నారు. సౌత్ ఇండియాలో మేనరికం అనేది ఎన్నో తరాలుగా, సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. దాన్ని తమ కథలో చూపించడం సహజం. బాలీవుడ్ లేదా ఉత్తరాది వారికి అది విచిత్రంగా అనిపించవచ్చేమో.. కానీ ఒక ప్రాంతీయ సినిమా చేస్తున్నప్పుడు అక్కడి నేటివిటీని గౌరవించాలని ఆమెకు హితవు పలుకుతున్నారు.
also read:వర్షిణినీ అవమానించిన త్రిగుణ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడవా
కెరియర్ ప్రారంభంలోనే పేరు, గుర్తింపు , మంచి పారితోషకం కోసం ఇలాంటి మాస్ సినిమాలకు సంతకం చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుతున్న తర్వాత, నీకు గుర్తింపుని ఇచ్చిన ఇండస్ట్రీ పైనే విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాదు లెజెండ్ తర్వాత ఆమె మళ్ళీ బాలకృష్ణ తోనే లయన్ సినిమాలో నటించడాన్ని కూడా కొందరు గుర్తు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా రాధిక ఆప్టే చేసిన కామెంట్లు ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. మరి దీనిపై ఆమె ఎలాంటి సమాధానమిస్తుందో చూడాలి.