E-Paper
Advertisement

క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్ కు కళ్లు చెదిరే డిమాండ్, జస్ట్ 6 నిమిషాల్లోనే అన్నీ సేల్!

క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్ కు కళ్లు చెదిరే డిమాండ్, జస్ట్ 6 నిమిషాల్లోనే అన్నీ సేల్!
Advertisement

Royal Enfield Classic 650 Hypershift Edition: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చిన క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ ఎడిషన్ కేవలం ఆరు నిమిషాల్లోపే అమ్ముడైపోయింది. ఈ స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్‌లో కేవలం 125 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడంతో బుకింగ్‌లకు భారీ స్పందన లభించింది. చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ప్రత్యేక మోటార్‌ సైకిల్‌ను రూ.4.26 లక్షల ధరతో అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 16 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా, అమ్మకాలు ప్రారంభమైన ఆరు నిమిషాల్లోపే మొత్తం 125 బైక్‌లు అమ్ముడయ్యాయి. వీటి డెలివరీలను నవంబర్ నుంచి ప్రారంభించనున్నారు.

స్పెషల్ కలర్.. ఆకట్టుకునే డిజైన్..

క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేకమైన కలర్ స్కీమ్. బైక్‌పై కాంతి పడినప్పుడు రెడ్, గ్రీన్, గోల్డ్ కలర్స్ మధ్య మారుతూ కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన పెయింట్ ఫినిషింగ్ బైక్‌కు కొత్త లుక్‌ను అందిస్తుంది. దీనికి అదనంగా ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెళ్లపై 125 ఏళ్ల వారసత్వాన్ని గుర్తుచేసే ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేశారు. చేతితో గీసిన పిన్‌ స్ట్రైప్స్ కూడా ఈ బైక్ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి. సాధారణ క్లాసిక్ 650తో పోలిస్తే ప్రధానంగా కాస్మెటిక్ మార్పులే ఇందులో ఉన్నాయి.

అదే 648cc ఇంజిన్.. 47hp పవర్

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే హైపర్‌షిఫ్ట్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 648cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 47hp పవర్‌తో పాటు 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ను ఇంటర్‌సెప్టర్ 650లో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ఛాసిస్‌ను సూపర్ మెటియోర్ 650 నుంచి తీసుకున్నారు. అయితే సూపర్ మెటియోర్‌లో USD ఫోర్కులు ఉండగా, క్లాసిక్ 650లో సాధారణ RSU ఫోర్కులను ఉపయోగించారు.

సాధారణ మోడళ్లతో పోలిస్తే ధర ఎంత ఎక్కువ అంటే?   

క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ ఎడిషన్ ధర రూ.4.26 లక్షలు. సాధారణ క్లాసిక్ 650 వల్లం రెడ్ వేరియంట్ ధర రూ.3.68 లక్షలు కాగా, టాప్ వేరియంట్ బ్లాక్ క్రోమ్ ధర రూ.3.82 లక్షలుగా ఉంది. అంటే.. హైపర్‌షిఫ్ట్ ఎడిషన్ ధర బేస్ వేరియంట్ కంటే సుమారు రూ.58,000, టాప్ వేరియంట్ కంటే రూ.43,500 ఎక్కువ.

Advertisement

కేవలం 125 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటం, ప్రత్యేకమైన కలర్గు, 125 ఏళ్ల వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్ ఈ బైక్‌కు డిమాండ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఆరు నిమిషాల్లోనే అన్ని యూనిట్లు అమ్ముడవడం రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల్లో ఈ స్పెషల్ ఎడిషన్‌కు ఉన్న క్రేజ్‌ ను స్పష్టం చేస్తోంది.

Read Also: అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

Tags

Related News

భారత్‌ లోకి బేబీ ల్యాండ్ క్రూయిజర్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?

Big Stories

Advertisement
×