E-Paper
Advertisement

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్..  టోల్ రేట్లు భారీగా పెంపు!
Advertisement

Expressway Toll Charges Hike: ఎక్స్‌ ప్రెస్‌ వేపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. ఈ మేరకు బెంగళూరు-చెన్నై ఎక్స్‌ ప్రెస్‌ వేపై టోల్ ఛార్జ్ ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో అందుబాటులో ఉన్న 71 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే మార్గానికి టోల్ ఛార్జీలను సవరించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ కొత్త రేట్లు 2027 మార్చి 31 వరకు కొనసాగనున్నాయి.

కార్లకు టోల్ ఎంత?

హోసకోట నుంచి కేజీఎఫ్ సమీపంలోని సుందరపల్య వరకు ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్లు లాంటి లైట్ వెయిట్ వెహికల్స్ కు ఒకవైపు ప్రయాణానికి రూ.150 టోల్ నిర్ణయించారు. అదే రోజు వెళ్లి రావాలంటే రూ.225 చెల్లించాలి. తరచూ ఈ మార్గంలో ప్రయాణించే వారికి నెలవారీ 50 ట్రిప్స్ పాస్‌ను రూ.4,955కు అందుబాటులో ఉంచారు. కేజీఎఫ్ నుంచి హోసకోట వైపు ప్రయాణించే వాహనాలకు కూడా ఇదే రేట్లు వర్తిస్తాయి.

ఇతర వాహనాలకు కొత్త రేట్లు

Advertisement

లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్స్, గూడ్స్ క్యారియర్లు, మినీ బస్సులకు ఒకవైపు ప్రయాణానికి రూ.240, రానుపోను ప్రయాణానికి రూ.360 టోల్ నిర్ణయించారు. పెద్ద బస్సులు, ట్రక్కులు ఒకవైపు ప్రయాణానికి రూ.505, రౌండ్ ట్రిప్‌కు రూ.755 చెల్లించాల్సి ఉంటుంది. మూడు యాక్సిల్స్ ఉన్న వాణిజ్య వాహనాలకు రూ.550 టోల్ ఉండగా, నాలుగు నుంచి ఆరు యాక్సిల్స్ ఉన్న వాహనాలకు రూ.790, ఏడు లేదా అంతకంటే ఎక్కువ యాక్సిల్స్ ఉన్న భారీ వాహనాలకు రూ.960 వరకు టోల్ నిర్ణయించారు.

నాలుగు టోల్ ప్లాజాలు

కర్ణాటకలోని ఈ ఎక్స్‌ ప్రెస్‌వే మార్గంలో మొత్తం నాలుగు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. హోసకోట సమీపంలోని హెడగినబెలె, మాలూరు సమీపంలోని అగ్రహార, కేజీఎఫ్‌లోని కృష్ణవరం, సుందరపల్య ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎక్స్‌ ప్రెస్‌వేపై కార్లు, జీపులు, బస్సులు, ట్రక్కులు, మినీ బస్సులకు మాత్రమే అనుమతి ఉంది. టూ వీలర్స్,  ఆటోరిక్షాలు, ట్రాక్టర్ల ప్రవేశంపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.

వరుసగా రెండోసారి టోల్ పెంపు

Advertisement

గత ఐదు నెలల్లో కర్ణాటకలోని ప్రధాన జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. దీంతో సాధారణ ప్రయాణికులతో పాటు సరుకు రవాణా సంస్థలపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా లాజిస్టిక్స్ రంగంలో రవాణా వ్యయం పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇంకా పూర్తిగా ప్రారంభం కాని ఎక్స్‌ ప్రెస్‌ వే

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 262 కిలోమీటర్లు. ఈ హైవే పూర్తిగా సిద్ధమైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. అయితే, ప్రస్తుతం మొత్తం మార్గం అందుబాటులో లేదు. కర్ణాటకలోని 71 కిలోమీటర్ల భాగం, ఆంధ్రప్రదేశ్‌లోని బెతమంగళ నుంచి బైరెడ్డిపల్లి వరకు ఉన్న సుమారు 25 కిలోమీటర్ల మార్గం మాత్రమే ట్రాఫిక్‌ కోసం ఓపెన్ చేశారు. తమిళనాడులోని మిగిలిన భాగంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోయినా, అందుబాటులో ఉన్న మార్గాల్లో కొత్త టోల్ రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

Read Also:ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

Tags

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×