E-Paper
Advertisement

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!
Advertisement

Samantha Baby Bump Photo: మా ఇంటి బంగారం సినిమాతో వందకోట్లు కొల్లగొట్టిన సమంత ఇపుడు మరో సారి మీడియాలో హైలెట్ అవుతుంది.ఈ మధ్యే తాను తల్లి కాబోతున్నానని చెప్పి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.తొలిసారి బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురుస్తుంది.”కంగ్రాట్స్ సామ్”, “హ్యాపీ మదర్‌హుడ్”, “నీకు అంతా మంచే జరగాలి” అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు మూవీ లవర్స్.

ఈ ఫొటోలో సమంత చాలా సింపుల్‌గా కనిపించినా.. అదే ఆమె స్పెషాలిటీ అని చెప్పాలి. మస్టర్డ్ యెల్లో కలర్ కేప్ గౌన్, టర్కాయిస్ ఇయర్‌రింగ్స్, స్టైలిష్ బన్ హెయిర్‌స్టైల్‌తో చాలా ఎలిగెంట్‌గా కనిపించింది. ఎలాంటి ఓవర్ గ్లామర్ లేకుండా, చిన్న నవ్వుతో పోజిచ్చిన ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సామ్ 

ఈ మధ్య  దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత.. త్వరలో తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సామ్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ బేబీ బంప్ ఫొటో రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.

Advertisement

సమంత జర్నీని చూస్తే.. ఆమె ఎన్నో కష్టాలు చూసింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో సవాళ్లు వచ్చినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. తన పనిపైనే ఫోకస్ పెట్టి ఒక్కో అడుగు ముందుకు వేసింది. అందుకే ఇప్పుడు ఆమె జీవితంలో ఇలాంటి హ్యాపీ మూమెంట్ రావడం చూసి అభిమానులు కూడా నిజంగానే సంతోషపడుతున్నారు.

సోలో హీరోయిన్‌ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు

మరోవైపు కెరీర్ పరంగా కూడా సమంత మంచి ఫామ్‌లో ఉంది. ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది.వంద కోట్ల పై చిలుకు సాధించి  సోలో హీరోయిన్‌గా చేసిన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథల ఎంపికలోనూ, నటనలోనూ మరోసారి తన స్టామినా ఏంటో సమంత చూపించిందని అభిమానులు అంటున్నారు.

ఇప్పుడు పూర్తిగా సామ్ టైమ్ నడుస్తోంది

ఒకవైపు సినిమా సక్సెస్.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో గుడ్ న్యూస్.. ఇలా వరుసగా మంచి విషయాలే సమంత జీవితంలో జరుగుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో చాలామంది “ఇప్పుడు పూర్తిగా సామ్ టైమ్ నడుస్తోంది” అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

also read :కుక్కల కోసం లక్షల్లో …ఈ హీరోయిన్స్ లవ్ మాములుగా లేదుగా !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు తల్లిగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతోంది. ఈ కొత్త దశ కూడా ఆమె జీవితంలో ఎంతో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన బేబీ బంప్ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related News

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

కుక్కల కోసం లక్షల్లో …ఈ హీరోయిన్స్ లవ్ మాములుగా లేదుగా !

వారణాసి స్టోరీ బయటపెట్టిన రాజమౌళి.. రూమర్స్ కి చెక్ పెడుతూ!

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. గౌరీ ప్రియా కామెంట్స్ వైరల్ !

కొడుకులతో ప్రత్యేక పూజ చేయిస్తున్న హీరో ధనుష్!

‘అగధ’ మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి.. ఆసక్తి రేపుతున్న ట్రైలర్!

ప్రైవేట్ పార్టీలో అదరగొట్టేసిన మృణాల్ ఠాకూర్..వీడియో వైరల్!

Big Stories

Advertisement
×