E-Paper
Advertisement

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?
Advertisement

Cybertruck Production Extension: ఎలాన్ మస్క్‌ కు చెందిన టెస్లా (Tesla) తన ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ సైబర్‌ ట్రక్ (Cybertruck) ఉత్పత్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన గడువు కంటే మరికొంత కాలం పాటు ఈ వాహనాన్ని తయారు చేయాలని నిర్ణయించింది. టెక్సాస్‌ లోని గిగాఫ్యాక్టరీలో సైబర్‌ ట్రక్ ఉత్పత్తిని 2027 మధ్య నాటికి నిలిపివేయాలని తొలుత భావించారు. అయితే, తాజాగా ఈ గడువును 2027 వేసవి చివరి వరకు పొడిగించారు. దీంతో మరో రెండు మూడు నెలల పాటు సైబర్‌ట్రక్ తయారీ కొనసాగనుంది.

సైబర్‌ ట్రక్ ఉత్పత్తి గడువును పొడిగింపు ఎందుకంటే?

సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువును పొడిగించడానికి ప్రధాన కారణం పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను పూర్తి చేయడమేనని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, అంతకుముందు సైబ ర్‌ట్రక్ కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న చాలామందికి వారి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి రావచ్చని మస్క్ చెప్పుకొచ్చారు. తాజాగా ఉత్పత్తి పొడిగింపుపై స్పందిస్తూ, లాభాల పరంగా ఇది సరైన నిర్ణయం కాకపోవచ్చని, కానీ, వ్యాపారంలో భావోద్వేగాలకు కూడా కొంత ప్రాధాన్యత ఉండాలన్నారు.

ఆశించిన స్థాయిలో లేని అమ్మకాలు

Advertisement

సైబర్‌ ట్రక్‌ ను టెస్లా 2023లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వెహికల్ మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అమ్మకాలు మాత్రం ఆశించినంతగా లేవు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 63,000 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వాస్తవానికి, సైబర్‌ట్రక్ కోసం ఏడాదికి 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించారు. కానీ, ఆ స్థాయి డిమాండ్‌ను ఈ మోడల్ అందుకోలేకపోయింది. దీంతో ఉత్పత్తిని కొనసాగించడం కంటే ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సైబర్‌ క్యాబ్ కోసం కొత్త ప్రణాళిక

సైబర్‌ ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయాలనే నిర్ణయం వెనుక మరో ముఖ్యమైన కారణం ఉంది. టెస్లా అభివృద్ధి చేస్తున్న కంప్లీట్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ టాక్సీ ‘సైబర్‌క్యాబ్’ (Cybercab) తయారీకి అవసరమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. సైబర్‌ ట్రక్ ఉత్పత్తి గడువు కొంతకాలం పొడిగించినప్పటికీ, టెస్లా భవిష్యత్తు ప్రణాళికల్లో సైబర్‌క్యాబ్‌కు ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ మార్పులు కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Advertisement

Read Also: అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

Tags

Related News

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×