E-Paper
Advertisement

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!
Advertisement

Tata Nexon New Model: టాటా మోటార్స్ (Tata Motors) పాపులర్ కాంపాక్ట్ SUV నెక్సాన్‌ కు సరికొత్త లుక్ ను  ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్న తదుపరి తరం నెక్సాన్‌ కు సంబంధించిన స్పై షాట్స్ బయటకు వచ్చాయి. 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ కొత్త మోడల్‌ లో డిజైన్‌తో పాటు ప్లాట్‌ ఫామ్, ఇంటీరియర్‌ లోనూ కీలక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్ దాదాపు పదేళ్ల క్రితం పరిచయమైంది. ఈ మధ్యకాలంలో 2020, 2023 సంవత్సరాల్లో రెండు కీలక ఫేస్‌ లిఫ్ట్‌లను అందుకుంది. ఇప్పుడు పూర్తిగా న్యూ జెనరేషన్ మోడల్ ను తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కు ఇంటర్నల్ గా ‘గరుడ్’ (Garud) అనే కోడ్‌ నేమ్‌ తో పిలుస్తున్నారు.

కొత్త డిజైన్.. మరింత ఆకట్టుకునేలా..   

టెస్టింగ్ సమయంలో కనిపించిన కారు పూర్తిగా క్యామోఫ్లాజ్‌తో కప్పి ఉండటంతో అసలు డిజైన్ వివరాలు బయటపడలేదు. అయినప్పటికీ, వెనుక విండ్‌ స్క్రీన్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే మరింత వాలుగా కనిపిస్తోంది. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ ల్యాంప్ సెటప్ కొనసాగే అవకాశం ఉంది. అయితే, కొత్త గ్రిల్, బంపర్, లైటింగ్ డిజైన్‌తో ఫ్రంట్ లుక్ పూర్తిగా మారనుంది.

Advertisement

బంపర్‌పై రాడార్ మాడ్యూల్ కనిపించడం మరో ఆసక్తికరమైన అంశం. దీన్ని బట్టి కొత్త నెక్సాన్‌ లో ADAS భద్రతా ఫీచర్లు కొనసాగే అవకాశం ఉంది. కొత్త అల్లాయ్ వీల్స్‌ తో పాటు బ్యాక్ వీల్స్ కు డిస్క్ బ్రేకులు కూడా అందించవచ్చని స్పై షాట్స్ వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం నెక్సాన్‌ లో వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

ఇంటీరియర్‌లోనూ కీలక మార్పులు

కొత్త నెక్సాన్ క్యాబిన్‌ లో రెండు ఫ్రీ స్టాండింగ్ స్క్రీన్లు ఉండే అవకాశం ఉంది. డ్యాష్‌ బోర్డ్ డిజైన్ పూర్తిగా మారనుంది. టాటా ప్రత్యేకమైన ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను కొనసాగించే అవకాశం ఉంది. కొత్త ఇంటీరియర్ థీమ్‌ తో పాటు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చు.

పెట్రోల్, CNG కొనసాగుతాయా?

Advertisement

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ప్రస్తుత పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్స్ కొత్త తరంలోనూ కొనసాగే అవకాశం ఉంది. అయితే, డీజిల్ ఇంజిన్ గురించి ఇంకా క్లారిటీ లేదు. రాబోయే BS7 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌ను అప్‌డేట్ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారవచ్చు. నెక్సాన్ EVకి కూడా కొత్త అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్రోల్, డీజిల్, CNG మోడళ్లతో పాటే EV వెర్షన్‌ను విడుదల చేస్తారా? లేక విడిగా పరిచయం చేస్తారా? అనేది త్వరలో తెలియనుంది.

మార్కెట్ లో గట్టి పోటీ

2027లో విడుదలైన తర్వాత కొత్త టాటా నెక్సాన్‌ కు హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, స్కోడా కైలాక్ లాంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కొత్త డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్స్ తో నెక్సాన్ మార్కెట్ లో స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read Also: కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

Tags

Related News

కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చేతక్, ఏథర్‌కు పోటీగా వెస్పా ఈవీలు.. మూడు మోడళ్లలో ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×