E-Paper
Advertisement

కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!

కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!
Advertisement

November 2026 Car Discounts: కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి నవంబర్ 2026లో కొన్ని కార్ల కంపెనీలు అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా వోక్స్‌ వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించగా, టాటా మోటార్స్‌ కు చెందిన ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ కార్లపైనా స్పెషల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రూపంలో ఈ ఆఫర్లు లభిస్తున్నాయి.

వోక్స్‌ వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్‌పై రూ.6 లక్షల వరకు తగ్గింపు

ఈ నెలలో పెద్ద మొత్తంలో ఆఫర్లు అందిస్తున్న కార్లలో వోక్స్‌ వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ ముందుంది. ఎంపిక చేసిన వాహనాలు, మిగిలిన స్టాక్‌పై కొనుగోలుదారులు రూ.5.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ బెనిఫిట్స్ డీలర్‌ షిప్, వెహికల్ తయారీ సంవత్సరం, స్టాక్ లభ్యతను బట్టి మారే అవకాశం ఉంది.

వర్టస్, టైగన్‌పైనా అదిరిపోయే ఆఫర్లు

Advertisement

వోక్స్‌ వ్యాగన్ వర్టస్, టైగన్ మోడళ్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా నవంబర్‌ లో మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా MY2025, MY2026కు చెందిన ఎంపిక చేసిన వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లాయల్టీ, కార్పొరేట్ ఆఫర్లు కలిపి రూ.5.5 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. పాత స్టాక్, నిర్దిష్ట వేరియంట్లపై ఈ ఆఫర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వోక్స్‌ వ్యాగన్ టేరాన్‌పై స్పెషల్ డీలర్ ఆఫర్లు

వోక్స్‌ వ్యాగన్ టేరాన్‌పై కూడా ఎంపిక చేసిన ట్రిమ్‌లు, స్టాక్ ఆధారంగా రూ.1.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు ప్రమోషనల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. పండుగ సీజన్ ఆఫర్లతో పాటు డీలర్ స్థాయిలో ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలను బట్టి ఆఫర్లు అందిస్తుంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లపైనా బెనిఫిట్స్

Advertisement

టాటా మోటార్స్‌ కు చెందిన కర్వ్ EVపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రీ ఫేస్‌లిఫ్ట్, నాన్-X సిరీస్ మోడళ్లపై గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు కలిపి రూ.3.35 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డీలర్లు అందించే ప్రత్యేక పండుగ ఆఫర్లతో ఈ బెనిఫిట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంపిక చేసిన టాటా హారియర్ EV వేరియంట్లు, మిగిలిన EV స్టాక్‌పై రూ.3.25 లక్షల వరకు ప్రమోషనల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

కారు కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ డిస్కౌంట్లు అన్ని నగరాల్లో, అన్ని వేరియంట్లకు ఒకేలా వర్తించవు. తయారీ సంవత్సరం, వెహికల్ స్టాక్, డీలర్‌షిప్ నిబంధనలను బట్టి ఆఫర్లు మారుతాయి. అందువల్ల కారు బుక్ చేసుకునే ముందు దగ్గరలోని షోరూమ్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read Also: రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!

Tags

Related News

రూ.50 వేల లోపు 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేంజ్, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

రెనాల్ట్ డస్టర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. హైబ్రిడ్ మోడల్ డెలివరీలు షురూ!

రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధరలు పెరిగాయ్.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

టీవీఎస్ ఎన్‌టార్క్ 150కు కొత్త లుక్.. స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ భలే ఉంది భయ్యా!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. టిగువాన్‌పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×