E-Paper
Advertisement

ఒరేయ్ గుర్నూర్..నీకు బుద్దుందా, వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నావ్?

ఒరేయ్ గుర్నూర్..నీకు బుద్దుందా, వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నావ్?
Advertisement

Sunil Gavaskar On Gurnoor Brar vs Tim Seifert war:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బే ఓవల్ వేదికగా నాలుగో వ‌న్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. అయితే, న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ అర్ధ‌ సెంచరీ చేసిన తర్వాత గుర్నూర్ బ్రార్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా గుర్నూర్ బ్రార్ అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

టిమ్ సీఫెర్ట్ ముందుకు వెళ్లి అరుస్తూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో గుర్నూర్ బ్రార్ ను విరాట్ కోహ్లీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. లేక‌పోతే గ్రౌండ్ లోనే బ్రార్, టిమ్ సీఫెర్ట్ త‌న్నుకునేవాళ్లు. అయితే ఈ సంఘటనపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక్క వికెట్ తీయగానే వీధి రౌడీలా బిహేవ్ చేస్తావా ? అంటూ బ్రార్ పై ఫైర్ అయ్యాడు.

ఒరేయ్ గుర్నూర్..నీకు బుద్దుందా, వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నావ్?

Advertisement

న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డే సందర్భంగా ఓవరాక్షన్ చేసిన గుర్నూర్ బ్రార్ పై సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. ఒక్క వికెట్ తీయగానే సహనం కోల్పోయి వీధి రౌడీలా బిహేవ్ చేస్తావా? అంటూ నిప్పులు చెరిగాడు. ఇది టీమిండియా కల్చర్ కాదని మండిపడ్డాడు. విదేశీ గడ్డపై ఆడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని చురకలు అంటించాడు. వికెట్ తీస్తే సెలబ్రేషన్స్ చేసుకోవాలి కానీ.. బ్యాటర్ ముందు రౌడీయిజం మానుకోవాలని ఆగ్రహించాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నువ్వు.. శ్రీశాంత్ తరహాలో బిహేవ్ చేస్తే కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించాడు. అంత ఆవేశపడి నువ్వు ఏం సాధిస్తావ్? అంటూ ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగిందని.. లేకపోతే మైదానంలోనే ఇద్దరు తన్నుకునే వాళ్లని వ్యాఖ్యానించాడు. దీంతో గుర్నూర్ బ్రార్ పై సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

అస‌లు గుర్నూర్ బ్రార్, టిమ్ సీఫెర్ట్ గొడ‌వ‌కు కార‌ణం ఏంటి?

Advertisement

టీమిండియాతో జరుగుతున్న 4వ వన్డే సందర్భంగా న్యూజిలాండ్ ఇరగదీస్తోంది. ఈ క్రమంలోనే భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 14 పరుగులు రాబట్టాడు. దీంతో సహనం కోల్పోయిన గుర్నూర్… స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ రోజు నువ్వు లక్కీ పర్సన్.. అందుకే దాటిగా బ్యాటింగ్ చేస్తున్నావని రెచ్చగొట్టాడు. అయితే దీనికి టిమ్ సీఫెర్ట్… ఘాటుగా రిప్లై ఇచ్చాడు. వెళ్లి నీ బౌలింగ్ నువ్వు చేసుకో పోరా? అన్నట్టుగా తిట్టాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసిన‌ గుర్నూర్ బ్రార్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

 

Related News

రాసిపెట్టుకోండి…ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై సెహ్వాగ్ కొడుకు సెంచరీ కొడతాడు

కావ్య పాప చేయి పట్టుకున్న స్టాలిన్..సోషల్ మీడియా విమర్శలు ?

ఆసియా కప్ ఫైనల్ చేరినా సుఖం లేదు…టీమిండియాకు తలనొప్పిగా మారిన మొహ్సిన్ నఖ్వీ

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..30 కిలోలు తగ్గిపోయిన డ్వేన్ జాన్సన్

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు…ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని టార్చ‌ర్ చేశాడు

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !

Big Stories

Advertisement
×