E-Paper
Advertisement

టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!
Advertisement

Best Budget Electric Cars in India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈవీ కొనాలనుకునేవారికి ధరతో పాటు సింగిల్ ఛార్జ్ తో ఎంత దూరం ప్రయాణించవచ్చనేది కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో మంచి రేంజ్, బెస్ట్ ఫీచర్లు అందించే 5 ఈవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.టాటా టియాగో ఈవీ

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి టాటా టియాగో ఈవీ బాగుటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.83 లక్షల నుంచి రూ.9.29 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి సుమారు 250 నుంచి 315 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. చిన్న కుటుంబాలకు, రోజువారీ సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

2.ఎంజీ కామెట్ ఈవీ

Advertisement

తక్కువ దూరం ప్రయాణించే వారికి ఎంజీ కామెట్ ఈవీ సూటబుల్ అవుతుంది. దీని ధర సుమారు రూ.6.24 లక్షల నుంచి రూ.7.90 లక్షల వరకు ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. చిన్న సైజ్  కారణంగా ట్రాఫిక్‌లో ఈజీగా నడపవచ్చు. పార్కింగ్ ఇబ్బందులు కూడా చాలా తక్కువ.

3.టాటా పంచ్ ఈవీ  

SUV తరహా డిజైన్‌తో పాటు మంచి రేంజ్ కోరుకునేవారు టాటా పంచ్ ఈవీని తీసుకోవచ్చు. దీని ధర రూ.8.19 లక్షల నుంచి రూ.12.99 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి సుమారు 315 నుంచి 421 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి.

4.ఎంజీ విండ్సర్ ఈవీ

Advertisement

కుటుంబ ప్రయాణాల కోసం విశాలమైన క్యాబిన్ కావాలనుకునేవారికి ఎంజీ విండ్సర్ ఈవీ సరిపోతుంది. దీని ధర సుమారు రూ.9.99 లక్షల నుంచి రూ.14.85 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ ఆప్షన్ ను బట్టి 331 నుంచి 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన ఇంటీరియర్ ఆకట్టుకుంటుంది.

5.టాటా నెక్సాన్ ఈవీ

మంచి రేంజ్‌తో పాటు SUV అనుభూతి కోరుకునేవారికి టాటా నెక్సాన్ ఈవీ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.11.66 లక్షల నుంచి రూ.17.89 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్‌ను బట్టి సుమారు 275 నుంచి 489 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. సిటీ ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ కారును తీసుకోవచ్చు.

ఏ కారు కొనడం మంచిది?

తక్కువ బడ్జెట్‌లో సిటీ ప్రయాణాలకు టియాగో ఈవీ, కామెట్ ఈవీ బాగుంటాయి. SUV లాంటి కారు కావాలంటే పంచ్ ఈవీ, ఎక్కువ స్థలం కావాలంటే విండ్సర్ ఈవీని తీసుకోవచ్చు. మంచి రేంజ్ కోసం నెక్సాన్ ఈవీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also: కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!

Tags

Related News

సింగిల్ ఛార్జ్ తో 600 కి.మీ ప్రయాణం.. ఇండియాలో టాప్ 5 లాంగ్ రేంజ్ ఈవీ కార్లు ఇవే!

కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!

రూ.50 వేల లోపు 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేంజ్, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

రెనాల్ట్ డస్టర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. హైబ్రిడ్ మోడల్ డెలివరీలు షురూ!

రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధరలు పెరిగాయ్.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

Big Stories

Advertisement
×