E-Paper
Advertisement

20 ఏళ్ల క్రితమే శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్ మూవీ ప్రకటన.. మరెందుకు పట్టాలెక్కలేదు?

20 ఏళ్ల క్రితమే శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్ మూవీ ప్రకటన.. మరెందుకు పట్టాలెక్కలేదు?
Advertisement

Salman Khan:నితేష్ తివారీ (Nithesh Tiwari) దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర (Namit Malhotra) ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన రామాయణ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ ప్రెస్టేజియస్ మూవీగా దసరా కానుకగా నవంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టి మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇందులో రాముడిగా రణవీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ కీలక పాత్రలు పోషించారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ల, అనుపమ్ ఖేర్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో వివిధ కీలక పాత్రలో నటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా ఒకవైపు థియేటర్లలో వరుస కలెక్షన్లతో దూసుకుపోతుంటే.. మరొకవైపు తాను కూడా 20 ఏళ్ల క్రితం రామాయణం సినిమా ప్రకటించానని , కానీ అది పట్టాలెక్కలేదు అంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

20 ఏళ్ల క్రితమే శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్..

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తూ, స్వయంగా నటిస్తున్న చిత్రం మాత్రం ‘మాతృభూమి’. ‘మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే ట్యాగ్ లైన్ తో డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా మారారు సల్మాన్ ఖాన్.

Advertisement

ఇదిలా ఉండగా ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విలేకరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్.. ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే ఒక రిపోర్టర్ రామాయణ సినిమా గురించి ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ..”20 ఏళ్ల క్రితమే రామాయణం సినిమాను ప్రకటించాము. అందులో నేను శ్రీరాముడిగా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

ALSO READ:సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!

రూమర్సే సినిమా ఆగిపోవడానికి కారణం – సల్మాన్ ఖాన్

Advertisement

అయితే మరో రిపోర్టర్ ప్రశ్నిస్తూ మళ్ళీ మీకు అవకాశం వస్తే రామాయణం సినిమాలో శ్రీరాముడిగా నటిస్తారా? అని ప్రశ్నించగా.. దీనికి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. “జర్నలిస్టులకు గుర్తుండే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం మేము రామాయణం సినిమా చేయాల్సి ఉండేది. అయితే ఒక రోజు రాత్రి నేను, నా సోదరుడు సోహైల్ ఖాన్ సినిమా ప్రకటన కోసం బయటకు వెళ్ళాము. మరుసటి రోజు వార్తాపత్రికల్లో కొంతమంది జర్నలిస్టులు నాతోపాటు నా సోదరుడి ఫోటోలను ముద్రించారు. మా తలలపై రెండు కిరీటాలను పెట్టి ఇతడే మా రాముడు.. ఇతడే మా లక్ష్మణుడు అంటూ వ్యంగంగా వార్తలు ప్రచురించారు. దీంతో అక్కడికక్కడే మేము ఆ సినిమాను వదిలేసాం ” అంటూ క్లారిటీ ఇచ్చారు సల్మాన్ ఖాన్.

చాలామంది హీరోల లాగే తాను కూడా శ్రీరాముడిగా రామాయణం సినిమా చేయాలనుకున్నాను కానీ తనపై వచ్చిన విమర్శల కారణంగానే తాను శ్రీరాముడిగా నటించలేకపోయాను అని క్లారిటీ ఇచ్చారు సల్మాన్ ఖాన్.

Related News

సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!

రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?

Tollywood Updates : స్టార్ హీరోల సినిమాలు.. షూటింగ్ అప్డేట్స్..

దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

ప్రియా భవాని శంకర్ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Big Stories

Advertisement
×