E-Paper
Advertisement

అల్ట్రావయోలెట్ To వెస్పా.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

అల్ట్రావయోలెట్ To వెస్పా.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Upcoming Electric Scooters 2026-27:  దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.  ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. 2026-27లో పలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో అల్ట్రావయోలెట్, వెస్పా, TVS, ఏథర్, ఓలా, హీరో లాంటి ప్రముఖ బ్రాండ్ల మోడళ్లు ఉండనున్నాయి. కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఇప్పుడే కొనాలా?  లేక మరికొంత కాలం వేచి చూడాలా? అనే డౌట్ ఉంటే, రాబోయే మోడళ్ల గురించి తెలుసుకోవడం బెస్ట్.

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్

ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కూటర్లలో అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ. 1.45 లక్షలు ఉండే అవకాశం ఉంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇది గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే టెసరాక్ట్ విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మొదట 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదల చేయాలని భావించిన కంపెనీ, తర్వాత సెకెండ్ క్వార్టర్ కు మార్చింది. ప్రస్తుతం 2027 ఫస్ట్ క్వార్టర్ విడుదల చేసే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. అందువల్ల ఈ మోడల్‌ పై ఆసక్తి ఉన్నవారు అధికారిక విడుదల తేదీ ప్రకటించే వరకు వెయిట్ చేయడం మంచిది.

ఎలెట్రికా ఎలక్ట్రిక్ స్కూటర్‌

Advertisement

మరోవైపు వెస్పా కూడా తన ఎలెట్రికా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని ధర సుమారు రూ. 1.70 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వెస్పా బ్రాండ్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్ ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. స్టైలిష్ లుక్‌తో పాటు ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. ధర, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మార్కెట్ లోకి అప్ డేటెడ్ మోడల్స్

కొత్త మోడళ్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రముఖ కంపెనీలు కూడా తమ మోడల్స్ ను అప్‌ డేట్ చేస్తున్నాయి. TVS ఐక్యూబ్ శ్రేణిని మరింత విస్తరించడంతో పాటు ప్రీమియం TVS Xపై కూడా దృష్టి సారిస్తోంది. ఏథర్ తన రిజ్టా, 450 సిరీస్‌లలో కొత్త వేరియంట్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఓలా కూడా S1, S1 Z, గిగ్ సిరీస్‌ లలో కొత్త అప్‌డేట్లు తీసుకురానుంది. హీరో తన విడా ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో కొత్త V2 వంటి మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ అప్‌ డేట్లలో మెరుగైన బ్యాటరీ, ఎక్కువ రేంజ్, కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది.

Advertisement

2026-27లో భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ మరింత పోటీగా మారనుంది. కొత్త టెక్నాలజీ, మెరుగైన రేంజ్, ఆధునిక ఫీచర్లతో పలు కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురానుండటంతో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ లభించనున్నాయి.

Read Also: ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ.. ఈ 3 ఈవీ స్కూటర్లలో విన్నర్ ఎవరు?

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×