Volkswagen November 2026 Discounts: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి వోక్స్ వ్యాగన్ (Volkswagen) గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 2026లో పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టైగన్, టిగువాన్ ఆర్-లైన్, టైరాన్, వర్టస్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మోడల్, వేరియంట్, తయారీ సంవత్సరం ఆధారంగా ఈ బెనిఫిట్స్ మారుతాయి.
ఈ నెలలో ఎక్కువ డిస్కౌంట్ వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్‌పై అందుబాటులో ఉంది. దీని పాత ఫీచర్ల వేరియంట్‌పై మొత్తం రూ.6 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ.3.5 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.2 లక్షల ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ ఉన్నాయి. వీటికి అదనంగా మరో రూ.50,000 బెనిఫిట్ కూడా లభిస్తుంది.
వోక్స్ వ్యాగన్ టైగన్ కొనాలనుకునే వారికి కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా MY2025 టాప్‌లైన్ 1.0 TSI మాన్యువల్ వేరియంట్‌పై రూ.2.7 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ.2 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.40,000 వరకు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి.
టాప్‌లైన్ ఆటోమేటిక్ MY2025 మోడల్‌పై రూ.1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ ఉండగా, MY2026 వెర్షన్‌పై రూ.1 లక్ష తగ్గింపు లభిస్తోంది. GT ప్లస్ వేరియంట్లపై కూడా రూ.1.51 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇతర ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.50,000 నుంచి రూ.80,900 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
వోక్స్ వ్యాగన్ టైరాన్ కొనుగోలుపైనా ఈ నెలలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ SUVపై మొత్తం రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ.1 లక్ష నగదు తగ్గింపు, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌తో పాటు మరో రూ.50,000 అదనపు తగ్గింపు లభిస్తుంది.
సెడాన్ ప్రియుల కోసం వోక్స్ వ్యాగన్ వర్టస్‌పై కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. MY2025 హైలైన్ 1.0 TSI ఆటోమేటిక్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.1,66,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.96,500 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.40,000 వరకు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి.
టాప్‌లైన్, GT ప్లస్ క్రోమ్, GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్లపై కూడా మోడల్ ఇయర్‌ను బట్టి రూ.50,000 నుంచి రూ.75,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి.
Read Also: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ MPV.. తొలిసారిగా కనిపించిన డెంజా D9!