E-Paper
Advertisement

అక్టోబర్ EV సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. టాప్ 5 కంపెనీల్లో ఎవరు ముందున్నారు?

అక్టోబర్ EV సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. టాప్ 5 కంపెనీల్లో ఎవరు ముందున్నారు?
Advertisement

Electric Two Wheeler Sales October 2026: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఈవీల కొనుగోళ్లు జోరందుకున్నాయి. అక్టోబర్ 2026లో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలలో టీవీఎస్ టాప్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. మరోవైపు, ఒకప్పుడు ఈవీ మార్కెట్‌లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ మాత్రం అమ్మకాల పరంగా వెనుకబడుతోంది.

60 వేల మార్క్ దాటిన TVS అమ్మకాలు

అక్టోబర్ 2026లో టీవీఎస్ మొత్తం 60,490 ఎలక్ట్రిక్ టూ వీలర్లను అమ్మింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది 94.7 శాతం వృద్ధి సాధించింది. దీంతో దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించిన కంపెనీగా టీవీఎస్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. టీవీఎస్ తర్వాత బజాజ్ ఆటో రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ అక్టోబర్‌లో 49,126 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే బజాజ్ అమ్మకాలు 51.3 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో బజాజ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్లు ఈ లెక్కలు చూపిస్తున్నాయి.

అమ్మకాల్లో ఏథర్, హీరో జోరు

Advertisement

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో ఈ కంపెనీ 31,833 యూనిట్లను అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 5.3 శాతం పెరిగాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే వృద్ధి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఏథర్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక హీరో మంచి దూకుడు కనబరిచింది. అక్టోబర్ 2026లో 29,923 ఎలక్ట్రిక్ టూ వీలర్లను అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 81.4 శాతం పెరిగాయి. దీంతో ఈ కంపెనీ టాప్ బ్రాండ్లలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

ఓలా ఎలక్ట్రిక్‌కు తగ్గుతున్న ఆదరణ

మొదటి ఐదు కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే అమ్మకాల పరంగా వెనుకంగ వేసింది. అక్టోబర్ 2026లో కంపెనీ మొత్తం 12,098 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 26.4 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2026తో పోల్చినా అమ్మకాలు 10.1 శాతం పడిపోయాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓలా.. ఇప్పుడు టీవీఎస్, బజాజ్, ఏథర్, హీరో వంటి సంస్థల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

 EV అమ్మకాలు పెరిగినా..  

Advertisement

అక్టోబర్ 2026లో దేశవ్యాప్తంగా మొత్తం 2,24,064 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఇది 48.5 శాతం అధికం. అయితే, మొత్తం టూ వీలర్ రిటైల్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా మాత్రం తగ్గింది. సెప్టెంబర్‌లో 11.6 శాతంగా ఉన్న ఈవీల వాటా అక్టోబర్‌లో 9.7 శాతానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం దీపావళి పండుగ తేదీల్లో వచ్చిన మార్పు కావచ్చని భావిస్తున్నారు. గత ఏడాది దీపావళి అక్టోబర్‌లో జరగ్గా, ఈ ఏడాది నవంబర్‌లో వచ్చింది. దీంతో పండుగ సందర్భంగా జరిగే వాహనాల కొనుగోళ్లలో కొంత భాగం నవంబర్‌కు మారినట్లు భావిస్తున్నారు.

Read Also: ఏథర్ సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 3 లక్షల స్కూటర్ల అమ్మకాలు!

Tags

Related News

భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ MPV.. తొలిసారిగా కనిపించిన డెంజా D9!

ఏథర్ సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 3 లక్షల స్కూటర్ల అమ్మకాలు!

టాటా కార్లపై నవంబర్ ఆఫర్లు.. సియెర్రాపై ఏకంగా రూ.1.15 లక్షల తగ్గింపు!

రోల్స్ రాయిస్‌ ను తలదన్నేలా BYD కొత్త లగ్జరీ కారు.. సింగిల్ ఛార్జ్ తో 1,000 కి.మీ రేంజ్!

జస్ట్ లక్షకే సోలార్ ఈవీ.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!

రేంజ్ 331 కిలో మీటర్లు.. ధర జస్ట్ 4.69 లక్షలే.. ఈ దీపావళి వేళ 4 చౌకైన ఈవీలు ఇవే!

Big Stories

Advertisement
×