E-Paper
Advertisement

టీవీఎస్ ఎన్‌టార్క్ 150కు కొత్త లుక్.. స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ భలే ఉంది భయ్యా!

టీవీఎస్ ఎన్‌టార్క్ 150కు కొత్త లుక్.. స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ భలే ఉంది భయ్యా!
Advertisement

TVS Ntorq 150 Spectral Green: టీవీఎస్ మోటార్ కంపెనీ ఎన్‌టార్క్ 150 స్కూటర్‌ లో కొత్త కలర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ స్కూటర్‌ కు తాజాగా ‘స్పెక్ట్రల్ గ్రీన్’ (Spectral Green) అనే కొత్త కలర్ ఆప్షన్‌ ను యాడ్ చేసింది. ఈ రంగు చూడటానికి ప్రత్యేకంగా, హుందాగా ఉండటంతో స్కూటర్ ప్రియులను మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ కొత్త కలర్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండదు. టాప్ ఎండ్ TFT వేరియంట్‌కు మాత్రమే కంపెనీ దీనిని పరిమితం చేసింది.

అధికారిక వెబ్‌ సైట్‌ లో కొత్త కలర్

గత నెలలోనే టీవీఎస్ ఎన్‌టార్క్ 150 కొత్త గ్రీన్ కలర్ లో ఓ డీలర్‌షిప్ దగ్గర కనిపించింది. అప్పట్లో ఈ రంగు మార్కెట్లోకి వస్తుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. తాజాగా కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కొత్త కలర్ ను చేర్చడంతో స్పష్టత వచ్చింది. దీనికి ‘స్పెక్ట్రల్ గ్రీన్’ అని పేరు పెట్టింది. ఈ కలర్ డార్క్ ఆలివ్ గ్రీన్ లో మరింతగా ఆకట్టుకుంటుంది.  ముందు మడ్‌ గార్డ్‌ తో పాటు స్కూటర్ వెనుక భాగంలో యెల్లో కలర్ హైలైట్స్ ఇచ్చారు. సాధారణ కలర్స్ కంటే కాస్త భిన్నంగా, ఎక్కువ హంగామా లేకుండా స్టైలిష్‌గా కనిపించేలా దీన్ని రూపొందించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వేరియంట్‌ లో బ్లాక్ కలర్ వీల్స్ అందించారు. మిగిలిన రంగుల్లో మాత్రం బాడీ కలర్‌ కు సరిపోయే వీల్స్ ఉంటాయి.

TFT వేరియంట్‌లో నాలుగు కలర్స్

Advertisement

స్పెక్ట్రల్ గ్రీన్ రాకతో టీవీఎస్ ఎన్‌టార్క్ 150 TFT వేరియంట్‌లో మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ రంగులకు ఇది అడిషనల్ గా వచ్చి చేరింది. వీటిలో కొత్త స్పెక్ట్రల్ గ్రీన్ ప్రత్యేకమైన, సింపుల్ లుక్ కోరుకునే వారికి బాగా నచ్చుతుంది.

ఇంజిన్, ఫీచర్లలో నో ఛేంజెస్

కొత్త కలర్ మినహా స్కూటర్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇందులో గతంలో ఉన్న 149.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 13.2hp పవర్, 14.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. TFT వేరియంట్‌లో 5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ప్రధాన ఫీచర్‌గా ఉంది. కొత్త స్పెక్ట్రల్ గ్రీన్ రంగుతో కూడిన ఈ వేరియంట్ ధరలోనూ ఎలాంటి మార్పు లేదు.

ధర ఎంతంటే?

Advertisement

టీవీఎస్ ఎన్‌టార్క్ 150 TFT వేరియంట్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.1.22 లక్షలుగా ఉంది. ఇక స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.13 లక్షలుగా నిర్ణయించారు. కొత్త కలర్ కావాలనుకునే వారు టాప్ ఎండ్ TFT వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Read Also: అక్టోబర్ EV సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. టాప్ 5 కంపెనీల్లో ఎవరు ముందున్నారు?

Tags

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. టిగువాన్‌పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

అక్టోబర్ EV సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. టాప్ 5 కంపెనీల్లో ఎవరు ముందున్నారు?

భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ MPV.. తొలిసారిగా కనిపించిన డెంజా D9!

ఏథర్ సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 3 లక్షల స్కూటర్ల అమ్మకాలు!

టాటా కార్లపై నవంబర్ ఆఫర్లు.. సియెర్రాపై ఏకంగా రూ.1.15 లక్షల తగ్గింపు!

రోల్స్ రాయిస్‌ ను తలదన్నేలా BYD కొత్త లగ్జరీ కారు.. సింగిల్ ఛార్జ్ తో 1,000 కి.మీ రేంజ్!

జస్ట్ లక్షకే సోలార్ ఈవీ.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

Big Stories

Advertisement
×