E-Paper
Advertisement

రాసి పెట్టుకోండి.. డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు

రాసి పెట్టుకోండి.. డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు
Advertisement

Aakash Chopra predicts Warner and Stokes Unsold: 2027 మినీ ఐపీఎల్ వేలానికి కౌంట్ డౌన్ షురూ అయింది. డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్, బెన్ స్టోక్స్ లాంటి ప్రముఖ క్రికెటర్లు కూడా ఐపీఎల్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ ఇద్దరు ఐపీఎల్ వేలం కోసం బరిలోకి దిగిన క్రమంలో ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ వార్నర్, బెన్ స్టోక్స్ ఇద్దరు కూడా ఐపీఎల్ 2027 వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోతారని పరువు తీశారు. పాకిస్తాన్ వేసే బిస్కెట్లకు ఆశపడే ఈ ఇద్దరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు అస్సలు కొనుగోలు చేయకూడదని సూచించాడు.

డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఓ ఫ్రాంచైజీకి డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నాడని.. అయినప్పటికీ ఐపీఎల్ వేలం కోసం పేరు నమోదు చేసుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని టీమిండియా మాజీ ప్లేయ‌ర్ ఆకాశ్ చోప్రా బాంబు పేల్చాడు. ఐపీఎల్ వేలంలో ఎవరైనా కొనుగోలు చేస్తే.. దాన్ని రిజెక్ట్ చేసి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడతానని ప్రకటించేందుకు డేవిడ్ వార్నర్ ఇలా ప్లాన్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఐపీఎల్ టోర్న‌మెంట్ ను కించ‌ప‌రిచి, పీఎస్ఎల్ ఆడాల‌న్న‌దే అత‌ని కుట్ర అంటూ వ్యాఖ్యానించాడు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

అందుకే ఇలాంటి ఆటగాళ్ల‌ను అస్సలు తీసుకోవద్దని కోరాడు. అటు రిటైర్మెంట్ ప్రకటించిన తాగుబోతు బెన్ స్టోక్స్ ను తీసుకుంటే ఫ్రాంచైజీలు నష్టపోతాయని హెచ్చరించాడు. అలా కాదని ఆల్ రౌండర్ కోటా కింద బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేస్తే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా.. తప్పించుకొని తిరుగుతాడని.. దీనివల్ల ఫ్రాంచైజీలు డబ్బులు నష్టపోతాయ‌ని వార్నింగ్ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతాడు తప్ప ఒక్క మ్యాచ్ ఆడబోడని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఇలాంటి వాళ్లను అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిల్చాల్సిందేనని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ వేలం.. 66 స్లాట్లకు 1220 మంది

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 మినీ వేలం నేపథ్యంలో 66 స్లాట్ల కోసం ఏకంగా 1220 మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. డేవిడ్ వార్నర్, బెన్ స్టాక్స్ తో పాటు తస్కిన్ అహ్మద్, హుద‌య్ తంజీమ్, హసీన్ నకీబ్, ఇస్లాం లాంటి 11 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 1220 మందిలో ఫ్రాంచైజీలు షార్ట్ లిస్టుల‌ను సమర్పిస్తాయి. డిసెంబర్ 4వ తేదీన తుది జాబితాను బీసీసీఐ ప్రకటిస్తుంది.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Related News

సన్‌గ్రూప్ ఉద్యోగుల కోసం కావ్య పాప దంపతుల షాకింగ్ నిర్ణయం..హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని మరీ!

ఐపీఎల్ వేలంలోకి వస్తే వైభవ్ రూ.40 కోట్లు పలుకుతాడు..ఆకాశ్ చోప్రా సంచలన ప్రకటన

వామ్మో ఏం బ్యాటింగ్ రా ఇది? వైభ‌వ్ ను త‌ల‌చుకుంటేనే వెన్నులో వ‌ణుకుపుడుతోంది

స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి..సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

పాకిస్తాన్ లో ఇంత క‌క్కుర్తి గాళ్లు ఉన్నారా? క‌దులుతున్న బైక్ పైనే క్యాచ్ ప‌ట్టి, బంతితో పారిపోయారు

బ‌లహీన యూఏఈపై డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డం మ‌గ‌త‌నం కాదు.. షాహిద్ హ‌ష్మీ సంచ‌ల‌నం

వైభవ్ ను ఇలాగే వ‌దిలేస్తే ట్రిపుల్ సెంచరీ సాధిస్తాడు.. చిన్ననాటి కోచ్ కామెంట్స్

Big Stories

Advertisement
×