E-Paper
Advertisement

టాటా ఏరిస్ బేస్ మోడల్ vs టాప్ మోడల్.. ఏ మోడల్ లో ఏం తేడాలున్నాయంటే?

టాటా ఏరిస్ బేస్ మోడల్ vs టాప్ మోడల్..  ఏ మోడల్ లో ఏం తేడాలున్నాయంటే?
Advertisement

Tata Aaris Base Model vs Top Model: కారు కొనాలనుకునే వారు బడ్జెట్ తో పాటు ఫీచర్లను కూడా చూస్తుంటారు. తక్కువ ధరలో కారు తీసుకోవాలా? లేక కొంచెం ఎక్కువ ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు ఉన్న మోడల్‌ను ఎంచుకోవాలా? అనేది ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టాటా ఏరిస్ విషయంలోనూ ఇదే సందేహం చాలామందికి రావచ్చు. టాటా మోటార్స్ తీసుకొచ్చిన ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్ రూ.5.29 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. మొత్తం ఐదు ట్రిమ్‌లలో లభించే ఏరిస్‌లో బేస్ స్మార్ట్ నుంచి టాప్ ఎండ్ అకాంప్లిష్డ్ వరకు ఫీచర్లలో చాలా తేడాలు ఉన్నాయి.

రూ.2.90 లక్షల వరకు ధర తేడా!

టాటా ఏరిస్ స్మార్ట్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.5.29 లక్షలు కాగా, అకాంప్లిష్డ్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.8.19 లక్షలు. అంటే రెండు వేరియంట్ల మధ్య రూ.2.90 లక్షల వ్యత్యాసం ఉంది. CNG వెర్షన్‌లో కూడా ఇదే తేడా కనిపిస్తుంది. స్మార్ట్ iCNG మాన్యువల్ రూ.6.29 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, అకాంప్లిష్డ్ iCNG మాన్యువల్ ధర రూ.9.19 లక్షలు. టాప్ వేరియంట్‌లో పెట్రోల్, CNG రెండింటికీ AMT ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

బయటి డిజైన్ గురించి..

Advertisement

స్మార్ట్ వేరియంట్‌లో 14 ఇంచుల స్టీల్ వీల్స్ ఉండగా, అకాంప్లిష్డ్‌లో 15 ఇంచుల డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. లైటింగ్ విషయంలోనూ టాప్ మోడల్ స్పష్టంగా ముందుంటుంది. బేస్ మోడల్‌లో హాలోజన్ హెడ్‌ల్యాంప్స్ ఉంటే, అకాంప్లిష్డ్‌లో ఆటోమేటిక్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, సీక్వెన్షియల్ DRLs, LED కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్  లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి తోడు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్, క్రోమ్ యాక్సెంట్లు కూడా టాప్ వేరియంట్‌కు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి.

లోపల టెక్నాలజీలో భారీ తేడా!

ఇంటీరియర్ విషయంలో బేస్, టాప్ మోడళ్ల మధ్య వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. స్మార్ట్ వేరియంట్‌ లో ఫ్యాక్టరీ ఫిట్ చేసిన మ్యూజిక్ సిస్టమ్ ఉండదు. ఆడియో సిస్టమ్ కోసం ఖాళీ DIN స్లాట్ మాత్రమే ఉంటుంది. అకాంప్లిష్డ్‌ లో మాత్రం 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. సీట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. బేస్ మోడల్‌లో ఫ్యాబ్రిక్ సీట్లు ఉంటే, టాప్ వేరియంట్‌లో లెదరెట్ అప్‌హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ ఆర్మ్‌ రెస్ట్, రియర్ సెంటర్ ఆర్మ్‌ రెస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

భద్రతలో ఏరిస్‌కు ప్రాధాన్యం!

Advertisement

భద్రత విషయంలో టాటా ఏరిస్ అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌ బ్యాగ్స్, ABS, EBD, కార్నరింగ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటి ఫీచర్లను అందిస్తోంది. అకాంప్లిష్డ్ వేరియంట్‌ లో TPMS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, డాష్‌క్యామ్ DVR లాంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. పుష్ బటన్ స్టార్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు కూడా టాప్ మోడల్‌లో ఉన్నాయి. స్మార్ట్ వేరియంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందితే, అకాంప్లిష్డ్ వేరియంట్ అదనపు సౌకర్యాలు, టెక్నాలజీ కోరుకునే వారి కోసం మరింత ఫీచర్ రిచ్ ప్యాకేజీతో వస్తుంది.

Read Also: డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

Tags

Related News

కారు నుంచి విమానం వరకు.. ఆటోపైలట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×