E-Paper
Advertisement

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!
Advertisement

Petrol Diesel Prices Today: పెట్రోల్ బంక్‌కు వెళ్లే ముందు ఒక్కసారి రేటు చూసుకోవడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. ఎందుకంటే లీటర్ ధరలో రూపాయి, రెండు రూపాయల తేడా వచ్చినా.. వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించే వారికి నెలాఖరులో ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు ఒకేలా ఉండవు. రాష్ట్రాల పన్నులు, స్థానిక పన్నులు, ఇతర ఖర్చుల కారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు కొనసాగుతుంది. సెప్టెంబర్ 30న దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీలో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువ?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు దేశంలోని తక్కువ ధరల ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 29న వివరాల ప్రకారం విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.117.25గా ఉంది. తిరుపతిలో రూ.117.88, కర్నూలులో రూ.117.95గా నమోదైంది. కర్నూలు ధర సెప్టెంబర్ 30న కూడా రూ.117.95గా ఉంది. అయితే జిల్లాను బట్టి ధర మారుతోంది.  విశాఖపట్నంలో పెట్రోల్ రూ.116.39గా ఉండగా, పశ్చిమ గోదావరిలో రూ.117.98గా ఉంది. అంటే రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల మధ్య కూడా స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.

హైదరాబాద్‌లో ఫ్యూయల్ రేట్లు ఎలా ఉన్నాయి?

Advertisement

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లో పెట్రోల్ ధర లీటర్‌ కు సుమారు రూ.116.15గా నమోదైంది. డీజిల్ ధర రూ.104.23గా ఉంది. ఈ ధరలు ఇటీవలి రోజుల్లో పెద్దగా మారకుండా కొనసాగుతున్నాయి. తెలంగాణలో కూడా జిల్లాలను బట్టి రేట్లు మారుతున్నాయి. సెప్టెంబర్ 29న వరంగల్‌లో పెట్రోల్ రూ.115.29గా, నల్లగొండలో రూ. 115.83గా నమోదైంది.

అండమాన్‌లో ఎందుకు తక్కువ?

దేశంలోని కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంధనంపై పన్నుల భారం తక్కువగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కనిపిస్తాయి. పోర్ట్ బ్లెయిర్‌లో డీజిల్ ధర రూ.84.56గా నమోదైంది. ఇది ఏపీ, తెలంగాణలోని డీజిల్ ధరలతో పోలిస్తే చాలా తక్కువ. ఇంధన ధరల విషయంలో పన్నుల విధానం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఒక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న ధర.. మరో ప్రాంతంలో తక్కువగా ఉండొచ్చు.

డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి?

Advertisement

విజయవాడలో సెప్టెంబర్ 30న డీజిల్ ధర లీటర్‌కు రూ.104.96గా ఉంది. సెప్టెంబర్‌లో ఈ ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ధరలు కొంత భిన్నంగా ఉన్నాయి. కర్నూలులో డీజిల్ రూ.105.61, నెల్లూరులో రూ.105.73, విశాఖపట్నంలో రూ.104.11గా నమోదయ్యాయి.

ఉదయం 6 గంటలకు ధరల సవరణ

దేశంలో డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానం అమల్లో ఉంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం, పన్నులు, ఇతర స్థానిక అంశాల ప్రభావంతో ఇంధన ధరలు మారవచ్చు. సాధారణంగా చమురు కంపెనీలు ఉదయం 6 గంటలకు రోజువారీ ధరలను సవరిస్తాయి.

Read Also: డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

Tags

Related News

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

Big Stories

Advertisement
×