Honda Avancier 2026: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా.. న్యూ జెనరేషన్ అవన్సియర్ (Honda Avancier) SUVని పరిచయం చేసింది. అద్భుతమైన డిజైన్‌తో పాటు అధునాతన హైబ్రిడ్ టెక్నాలజీ, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, లేటెస్ట్ ఫీచర్లతో ఈ కొత్త SUVని తీసుకొచ్చింది. హోండా డెవలప్ చేసిన నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్ ఈ కారులో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
కొత్త అవన్సియర్ లో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) పవర్‌ట్రెయిన్‌ను అందించారు. అయితే, ఇంజిన్ కెపాసిటీ, కంప్లీట్ పవర్ ట్రెయిన్ వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు. ఈ కొత్త హైబ్రిడ్ వ్యవస్థలో మరింత సమర్థవంతమైన ఇంజిన్, కాంపాక్ట్ డ్రైవ్ యూనిట్ తో పాటు అప్ డేటెడ్ కంట్రోల్ టెక్నాలజీ ఉన్నాయి. ఇందులో మోషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇది బ్రేకింగ్, డ్రైవింగ్ ఫోర్స్ ను కంట్రోల్ చేస్తూ మలుపుల్లో కారు బాడీ ఎక్కువగా వంగకుండా సాయపడుతుంది. ప్రిల్యూడ్, సివిక్ హైబ్రిడ్ మోడళ్లలో కనిపించే S+ షిఫ్ట్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఈ సిస్టమ్ తో ఆటోమేటిక్ గేర్ ఛేంజెస్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత నేచురల్ గా పొందేలా చేసింది.
సెకెండ్ జెనరేషన్ అవన్సియర్‌ను ‘గ్రాండ్ జర్నీ’ అనే కొత్త డిజైన్ స్టైల్ లో తయారు చేశారు. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, సన్నని LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, సింపుల్ గ్రిల్ ఆకట్టుకుంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో వాలుగా ఉండే రూఫ్ లైన్, మందపాటి D-పిల్లర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ అందించారు. వెనుకవైపు లాంగ్ LED లైట్ బార్, నిలువుగా ఉండే టెయిల్ లైట్లు, పెద్ద రూఫ్ స్పాయిలర్ ఆకట్టుకుంటాయి. ఈ SUV స్పోర్టీ లుక్ లో చూడగానే ఆకట్టుకుంటుంది.
ఇంటీరియర్ విషయంలోనూ హోండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. డ్యాష్ బోర్డ్ మధ్యలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. కొత్త డిజైన్ తో వచ్చిన త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరింతగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, డ్యాష్ బోర్డ్, డోర్లపై యాంబియంట్ లైటింగ్, డైమండ్ ప్యాటర్న్ డిజైన్, రెండు కప్ హోల్డర్లు, USB-C ఛార్జింగ్ పోర్టులు అందించారు. చిన్న వస్తువులు పెట్టుకునేందుకు ప్రత్యేక స్టోరేజ్ స్పేస్‌లు కూడా ఉన్నాయి.
కొత్త అవన్సియర్‌లో హైబ్రిడ్ టెక్నాలజీ, AWD సిస్టమ్, అత్యాధునిక డిజైన్ తో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అయితే ధర, పూర్తి ఇంజిన్ స్పెసిఫికేషన్లు, విడుదల తేదీ లాంటి వివరాలను హోండా త్వరలో వెల్లడించనుంది.
Read Also: అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఫ్రాంక్స్.. బాలెనోను వెనక్కి నెట్టి మరీ సరికొత్త రికార్డు!