E-Paper
Advertisement

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Advertisement

VinFast Patents: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి మరో విదేశీ కంపెనీ అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు పేటెంట్లు పొందిన ఈ సంస్థ తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు బైక్ కు కూడా పేటెంట్లు తీసుకుంది. దీంతో భారత మార్కెట్లో ఒకేసారి పలు విభాగాల్లో తన మోడల్స్ ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు పేటెంట్లు

విన్‌ఫాస్ట్ తాజాగా దాఖలు చేసిన పేటెంట్లలో ఒకటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా, మరొకటి ఎలక్ట్రిక్ బైక్. గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో ప్రదర్శించిన వెంటో ఎస్ (Vento S) స్కూటర్ డిజైన్‌ ను కొత్త పేటెంట్‌ లో చూడవచ్చు. అలాగే 2026 ప్రారంభంలో సంస్థ ప్రదర్శించిన ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ కాన్సెప్ట్‌ కు దగ్గరగా మరో బైక్ ఉంది. అయితే, ఈ రెండు వాహనాలను భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

వెంటో ఎస్ స్కూటర్‌లో ప్రత్యేకతలివే!

Advertisement

కొత్త స్కూటర్ పేటెంట్‌ లో కనిపిస్తున్న డిజైన్ వెంటో ఎస్‌ను పోలి ఉంది. సాధారణంగా విన్‌ఫాస్ట్ స్కూటర్లలో హబ్ మౌంటెడ్ మోటార్లను ఉపయోగిస్తారు. కానీ, వెంటో ఎస్‌లో మాత్రం సైడ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. అందువల్ల దీనిని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తీసుకొచ్చే అవకాశం ఉంది. వియత్నాంలో విక్రయించిన వెంటో ఎస్ వెర్షన్‌లో 5.2kW గరిష్ట శక్తిని అందించే మోటార్, 3.5kWh LFP బ్యాటరీ ఉన్నాయి. ఇది గంటకు గరిష్టంగా 89 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనిలో బ్యాక్ డిస్క్ బ్రేక్ కూడా ప్రత్యేక ఆకర్షణ. భారత వెర్షన్‌ లో రెండు వీల్స్ కు డిస్క్ బ్రేకులు, ABS వంటి ఫీచర్లు అందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఎలక్ట్రిక్ బైక్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు?

విన్‌ ఫాస్ట్ పేటెంట్ పొందిన రెండో వెహికల్ ఎలక్ట్రిక్ బైక్. ఇది కంపెనీ గతంలో ప్రదర్శించిన ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్‌ ను పోలి ఉంది. ఇందులో మందపాటి టైర్లు, పెద్ద బ్యాటరీ, ప్రత్యేకమైన మోటార్ హౌసింగ్ కనిపిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై సుబాబ్, సురద్, సుడబ్, సులాద్ పేర్లతో స్ట్రీట్, స్పోర్ట్, క్రూయిజర్, సూపర్‌ స్పోర్ట్ విభాగాల్లో బైక్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ ఫామ్‌లో 50kW శక్తిని ఉత్పత్తి చేసే మోటార్ ఉండవచ్చని వియత్నాం మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా.

భారత్‌లో లాంచ్ ఎప్పుడు?

Advertisement

భారత్‌ లో 50 డీలర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ విన్‌ ఫాస్ట్ తన కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. అయితే, పేటెంట్ పొందిన ప్రతి వెహికల్ మార్కెట్లోకి వస్తుందని చెప్పలేం. కంపెనీ ఈ మోడల్స్ కు సంబంధించి విడుదల తేదీలు, ధరలు కూడా ఇంకా వెల్లడించలేదు. అయితే, స్కూటర్లు, బైక్స్ లోని అన్ని సెగ్మెంట్లలో అడుగుపెట్టాలని విన్‌ఫాస్ట్ చూస్తుండటం భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో ఆసక్తిని పెంచుతోంది.

Read Also: చేతక్, ఏథర్‌కు పోటీగా వెస్పా ఈవీలు.. మూడు మోడళ్లలో ఏది బెస్ట్?

Tags

Related News

చేతక్, ఏథర్‌కు పోటీగా వెస్పా ఈవీలు.. మూడు మోడళ్లలో ఏది బెస్ట్?

హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!

SUV అమ్మకాల్లో మహీంద్రా దూకుడు.. 10 నెలల్లోనే 6.15 లక్షలు దాటిన సేల్స్!

130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? 300 కి.మీ రేంజ్ ఇచ్చే సూపర్ మోడల్స్ ఇవే!

టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

సింగిల్ ఛార్జ్ తో 600 కి.మీ ప్రయాణం.. ఇండియాలో టాప్ 5 లాంగ్ రేంజ్ ఈవీ కార్లు ఇవే!

Big Stories

Advertisement
×