E-Paper
Advertisement

హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!

హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!
Advertisement

October 2026 Two-Wheeler Sales: ఇండియన్ టూవీలర్ మార్కెట్లో ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ 2026లో టూవీలర్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినప్పటికీ, సెప్టెంబర్‌ తో పోల్చితే భారీగా పెరిగాయి. మరోవైపు మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న హీరోను హోండా వెనక్కి నెట్టింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అక్టోబర్‌లో 23.21 లక్షల టూవీలర్ల అమ్మకం 

FADA లెక్కల ప్రకారం.. అక్టోబర్ 2026లో దేశ వ్యాప్తంగా మొత్తం 23.21 లక్షల టూ వీలర్స్  రిటైల్ అమ్ముడయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో 32.40 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈసారి వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు తగ్గాయి. అయితే, సెప్టెంబర్ 2026లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే అక్టోబర్‌లో 29.67 శాతం పెరుగుదల కనిపించింది.

అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి?

Advertisement

అక్టోబర్‌లో అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం పండుగల తేదీల్లో మార్పు అని FADA వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నెలలోనే నవరాత్రి, దీపావళి పండుగలు రావడంతో వాహనాల కొనుగోళ్లు భారీగా జరిగాయి. కానీ, ఈ ఏడాది ధంతేరస్, దీపావళి పండుగలు నవంబర్‌లోకి మారాయి. దీంతో అక్టోబర్‌లో అమ్మకాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ, అక్టోబర్ నెల భారత ద్విచక్ర వాహన మార్కెట్లో రెండో బెస్ట్ మంత్ గా నిలిచింది. పండుగల సందర్భంగా జరిగిన కొనుగోళ్లు నవంబర్ రిజిస్ట్రేషన్ గణాంకాల్లో కనిపిస్తాయని FADA అంచనా వేస్తోంది.

హీరోను దాటేసిన హోండా!

ఈసారి టూ వీలర్ వెహికల్ మార్కెట్ వాటాలో హోండా కీలక స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్‌ లో హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 27.47 శాతం మార్కెట్ వాటాతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మరోవైపు హీరో మోటోకార్ప్ 25.78 శాతం వాటాతో రెండో స్థానానికి పరిమితమైంది. స్కూటర్లు, కమ్యూటర్ మోటార్‌ సైకిళ్ల సెగ్మెంట్ లో హోండా అమ్మకాలు పెరగడం ఈ మార్పుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో ఇండియన్ టూ వీలర్ వెహికల్స్ మార్కెట్లో హీరో, హోండా మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

10 శాతానికి చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా

Advertisement

సాంప్రదాయ పెట్రోల్ టూ వీలర్స్ అమ్మకాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మాత్రం ముందుకు సాగుతోంది. అక్టోబర్ 2026లో మొత్తం టూ వీలర్ వెహికల్ రిటైల్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 9.65 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ వాటా కేవలం 4.66 శాతంగా ఉంది. అంటే, ఏడాది వ్యవధిలో EVల మార్కెట్ వాటా రెట్టింపునకు పైగా పెరిగింది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచన, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి ఇందుకు కారణం అవుతోంది.

నవంబర్‌లో అమ్మకాలు పెరుగుతాయా?

దీపావళి, ధంతేరస్ కొనుగోళ్లు నవంబర్ నెలలో నమోదయ్యే అవకాశం ఉండటంతో టూవీలర్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా హోండా, హీరో మధ్య పోటీతో పాటు ఎలక్ట్రిక్ టూ వీలల్స్  ఆదరణ రాబోయే నెలల్లో మార్కెట్ తీరును డిసైజ్ చేయనున్నాయి.

Read Also: SUV అమ్మకాల్లో మహీంద్రా దూకుడు.. 10 నెలల్లోనే 6.15 లక్షలు దాటిన సేల్స్!

Tags

Related News

SUV అమ్మకాల్లో మహీంద్రా దూకుడు.. 10 నెలల్లోనే 6.15 లక్షలు దాటిన సేల్స్!

130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? 300 కి.మీ రేంజ్ ఇచ్చే సూపర్ మోడల్స్ ఇవే!

టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

సింగిల్ ఛార్జ్ తో 600 కి.మీ ప్రయాణం.. ఇండియాలో టాప్ 5 లాంగ్ రేంజ్ ఈవీ కార్లు ఇవే!

కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!

రూ.50 వేల లోపు 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేంజ్, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Big Stories

Advertisement
×