E-Paper
Advertisement

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు
Advertisement

Aadi Srinivas: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ‘భారత్ సమ్మిట్’కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాకపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.

రాహుల్ రాకపై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్

Advertisement

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తుంటే కేటీఆర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ‘పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకొని..  ఇప్పుడు నీతి పాఠాలు వల్లించడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాధనంతో ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. గత పదేళ్ల కాలంలో ఆ పార్టీ నేతలు అనుభవించిన రాజభోగాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.  అంతే కాకుండా ‘సిద్ధాంతం లేని పార్టీ బీఆర్ఎస్.. భావజాలం లేని బానిసలు మీరు.. శీలం లేని సన్నాసులు’ అంటూ ఆది శ్రీనివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్య రక్షణ కోసమే పర్యటన

Advertisement

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన కేవలం ప్రచారం కోసం కాదని, ప్రజాస్వామ్య రక్షణ , ప్రగతిశీల భావజాల వ్యాప్తి కోసమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీకి ప్రచారం అవసరం లేదని, ఆయన ఆలోచనలు కల్వకుంట్ల కుటుంబానికి అర్థం కావని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ ఇనుప కంచెల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ వైఖరిపై ఎందుకు మౌనం?

భారత్ సమ్మిట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు వస్తుండటంతో తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందనే భయం కేటీఆర్‌లో కనిపిస్తోందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సదస్సుకు వస్తున్న విదేశీ పాత్రికేయుల వీసాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుంటే కేటీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు నోరు మెద‌ప‌కుండా మూల‌కు కూర్చున్న నీకు రాహుల్ గాంధీ పర్యటనకు వస్తుంటే.. ఇప్పుడు నోరు లేస్తుందా..? నీకు భయం అయితే మోదీకి భజన చేసుకో.. ప్రేమ ఉంటే అమిత్ షా‌కు పూజ చేసుకో’ అంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని ఆది శ్రీనివాస్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: 200 కి.మీ. వేగం.. ఊడిపడిన ఇంజిన్.. ద్వారకా టన్నెల్‌లో భయానక ప్రమాదం!

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి.. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా, 8 మంది జవాన్ల పరిస్థితి విషమం

రాహుల్‌ను రీలాంచ్ చేయాల్సిన అవసరం లేదు.. ఆయనో గొప్ప జననేత: మహేష్ కుమార్ గౌడ్

యూనిఫాంలోవున్న నేరస్థుడు.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు ఆగ్రహం, అసలేం జరిగింది?

హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్.. కేఎఫ్‌సీ-డొమినోస్ సెంటర్లపై కొరడా! లైసెన్సులు రద్దు చేసిన అధికారులు

అక్రమ అండాల ముఠాతో 23కు పైగా ఐవీఎఫ్ సెంటర్లు.. ఎక్కడో తెలుసా..?

డిఫెన్సర్స్ సెక్యూరిటీ లైసెన్స్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

Big Stories

Advertisement
×