Ayodhya Donations: చిన్న కథ కాదు.. ఇది ఎవరి గురించో కాదు.. అయోధ్య రామమందిరం విరాళాలు పక్కదారి పట్టించిన నిందితుల గురించి.. ప్రతిరోజూ లక్షలకు లక్షలు నొక్కేశారాట.. సిట్ విచారణలో ఆ సొమ్ముతో విల్లాలు, జల్సాలు, పెద్దపెద్ద కార్లు కొని లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
అయోధ్య విరాళాలపై SIT దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. అక్రమార్కులు రోజుకు ఏకంగా రూ.6 నుంచి రూ.8 లక్షల మధ్య నొక్కేశారని సిట్ అధికారుల అంచనా వేస్తున్నారు. బ్యాంక్ అధికారులను సిట్ ప్రశ్నించడంతో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. అక్రమాలు జరగకముందు వరకు రామజన్మభూమి తీర్థ ట్రస్టు బ్యాంక్ ఖాతా రోజుకు రూ.16-18 లక్షలు వరకు జమయ్యేవి.. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా రూ.24-26 లక్షలకు పెరిగాయి. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తోంది.
Also read: Bandi Bhagirath: బండి భగీరథ్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. కేసులో అదనంగా మరో రెండు సెక్షన్లు!
8 మంది నిందితుల్లో ఐదుగురు అనుమానాస్పదంగా సీసీటీపీ ఫుటేజీల్లో కనిపించారు. వీరు విరాళాలు లెక్కించేప్పుడు, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్సులో దాచేసి నగదును పక్కదారి పట్టించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా వీరు నియమితులయ్యారు. నిందితుల్లో ఒకరైన ఔట్‌సోర్స్ ఉద్యోగి అవినాష్ శుక్లా.. ఆలయ ఉద్యోగిగా నియామకం కాకముందు హనుమాన్ గుహ వద్ద వాటర్ ప్లాంట్ నిర్వహించే వాడని తెలుస్తోంది. అతడినుంచి అయోధ్య పోలీసులు మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీని సీజ్ చేశారు.
మరో నిందితుడైన లవ్‌కుష్ మిశ్రా.. గతేడాది బనీపూర్‌లో వెయ్యి చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. రిజిస్టర్డ్ విలువ రూ.8లక్షలే ఉన్నప్పటికీ, మార్కెట్ విలువ రూ.25లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మరో నిందితుడైన రామ్ శంకర్ అలియాస్ టిన్ను గతంలో డ్రైవర్‌గా పనిచేయగా, విరాళాల సొమ్ముతో ఒక హాస్టల్‌ను ఓపెన్ చేసినట్లు సమాచారం.
Also read: Prashna Ravan: యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు!